టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 61వ రోజుకి చేరుకుంది. 61వ రోజు పాదయాత్ర అనంతపురం పట్టణంలోని పిల్లిగుండ్ల విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 61వ రోజుకి చేరుకుంది. 61వ రోజు పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పిల్లిగుండ్ల ఎంవైఆర్ కళ్యాణ మండపం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. యువగళం పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిల్లిగుండ్ల విడిది కేంద్రం వద్ద ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. ఎంవైఆర్ కళ్యాణ్ విడిది కేంద్రం వద్ద తనను కలవడానికి వచ్చిన యువతీ, యువకులు, అభిమానులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలానే యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని అనంతపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. నేడు పిల్లిగుండ్ల ఎంవైఆర్ కళ్యాణ మండపం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యాత్ర ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గొట్కూరులో లోకేశ్ బాబు స్థానికులతో మాటామంతీ నిర్వహించారు.
మణిపాల్ స్కూల్ వద్ద గ్రామస్థులతో సమావేశమై..వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బ్రాహ్మణపల్లి వద్ద యాదవ సామాజికవర్గీయులతో లోకేశ్ భేటీ అయ్యారు. కమ్మూరులో భోజన విరామం అనంతరం కూడేరులో నిర్వహించిన బహిరంగసభలో లోకేశ్ ప్రసంగించారు. నేడు లోకేశ్ పాదయాత్రలో అనంతపురం, ఉరవకొండ ప్రాంతాల్లో భారీగా రోడ్లపైకి స్థానిక ప్రజలు తరలివచ్చారు. అలానే లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. పాదయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలకు, అభిమానులకు లోకేశ్ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. మరి.. 61 వ రోజు లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.