మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జగన్ కు నమ్మిన బంటులా ఉన్న కొడాలి నాని ప్రత్యర్థి పార్టీల నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తుంటారు. తన మాటల తూటాలతో విపక్ష నేతలను ఇరుకున పెడుతూ కొరకరాని కొయ్యగా తయ్యారయ్యారు. ఇక కొడాలి నాని గత జగన్ కేబినెట్ లో పౌరసరఫరా, వినియోగదారుల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఇదిలా ఉంటే మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరిలో పాల్గొన్న నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇది కూడా చదవండి: Balakrsihna: సీఎం జగన్ కు సమస్యలా మారిన బాలకృష్ణ! ఇదేమి క్రేజ్ స్వామి?
నందమూరి తారకరామారావు వారసుడు చంద్రబాబు కాదని, Jr.NTR అసలైన వారసుడని అన్నారు. ఇక దీంతో పాటు వారసుడు అంటే తాత, కొడుకు, మనవడు. అసలు సీనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు వారసుడు ఎలా అవుతాడని కొడాలి నాని ప్రశ్నించారు. ఆయనను ఏమైన దత్తత తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఇక మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకంటూ కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ ది సింహంలా గాండ్రించే రక్తమని, చంద్రబాబుది నక్కజిత్తుల రక్తమని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కొడాలి నాని తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.