తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మొదటగా సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో కేసీఆర్ అభివృద్ధి మెరుగులు దిద్దాడు. ఈ దెబ్బతో ఆ గ్రామంలో రూపురేకలన్నీ మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎర్రవల్లికి ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది.
ఇక అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని ఆ విలేజ్‌ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ఇప్పటికి రెండు దఫాలుగా ఆ గ్రామాంలో కేసీఆర్ పర్యటించారు. ఇక తాజాగా బుధవారం ఆ గ్రామంలో పర్యటించి గ్రామంలోని దళిత వాడలు అన్ని కలియ తిరిగాడు. దీంతో గ్రామంలోని 76 కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని కూడా నేడు అమలు చేయనున్నాడు. ఇదే కాకుండా భూమిలేని ఎస్సీలకు భూమిని అందజేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్.
ఇక తాజాగా మెదక్ జిల్లా వైపు వెళ్తుండగా కౌశీరెడ్డిపల్లి గ్రామం దగ్గర ఆగి గ్రామాన్ని పరిశీలించారట సీఎం. ఇక వారం పది రోజుల్లో ఆ గ్రామానికి వెళ్లి గ్రామంలోని సమస్యలు తెలుసుకుంటారని సమాచారం. దీంతో పాటు గ్రామంలోని ప్రజలతో కలిసి భోజనం చేస్తానని హామీ సైతం ఇచ్చారట. దీంతో కేసీఆర్ ఆ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటున్నారన్న వార్తలు లేకపోలేదు. ఇక ఇరు గ్రామాలను దత్తత తీసుకున్న కేసీఆర్ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకాడటం లేదు. మరి అందరూ అనుకుంటున్నట్టే కౌశీరెడ్డిపల్లి గ్రామాన్ని నిజంగానే దత్తత తీసుకోబోతున్నారో లేదో చూడాలి మరి.