కౌశిక్ రెడ్డి..తెలంగాణ రాజకీయాల్లో ఓ మాదిరిగా వినిపిస్తున్న పేరు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా ఉన్నాడు. ఉన్నట్టుండి కొన్ని అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేతగా మారారు కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ కాంగ్రెస్ లీడర్ గా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం ఎన్నికల్లో చివరి వరకు గెలిచినంత పని చేశాడు. అప్పటికి టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ బలమైన నేతగా కొనసాగుతున్నారు. ఇక ఆ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో విశేషం.
కొన్ని కారణాల వాళ్ళ ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ నాకే అని ఎప్పటి నుంచి అనుకుంటున్న క్రమంలోనే కాస్త షాక్ తగిలింది. హుజురాబాద్ టీఆర్ఎస్ స్థానిక నేతలతో వరుస ఫోన్ కాల్ లు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ సారి టికెట్ నాకే వస్తుందంటూ ఫోన్ కాల్ సంభాషణ బహిర్గతమయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ అది నాయకత్వం కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపింది.
ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. ఇక ఎప్పటి నుంచో కౌశిక్ రెడ్డి టీఆరెఎస్ వెళ్తున్నారంటూ వార్తలు కూడా హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా రేపు తెరాస పార్టీలోకి కౌశిక్ రెడ్డి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక వాస్తవానికి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లే అంశంపై ఆ పార్టీ నేతలు ఒక్కరు కూడా స్పందించక పోవటం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. మరి నిజంగానే కౌశిక్ రెడ్డి కారు ఎక్కుతారా లేధో చూడాలి మరి.