ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలు అందరిని ఆశ్చరపరుస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరకుల కోసం గంటల పాటు బారులు తీరి నిల్చోవాల్సి వస్తోంది. గంటల కొద్ది విద్యుత్తు కోతలతో శ్రీలంక అల్లాడిపోతోంది. అంతర్జాతీయ ద్రవ్య మారక నిల్పవలు పడిపోవడంతో విదేశీ రుణాలను చెల్లించే పరిస్థితి లో లేమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద శ్రీలంక బెయిల్ అవుట్ దరఖాస్తూ పెండింగులో ఉంది.
శ్రీలంకకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం విదేశి రుణాలు పెరిగిపోవడం. 2021లో ఆ దేశ రుణం.. వారి స్థూల జాతీయోత్పత్తికి మించి పోయి.. ఏకంగా 102.8 శాతానికి చేరుకుంది. తమ అప్పులు తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో మన దేశంలోని కొన్ని రాష్ట్రాల పరిస్థితి శ్రీలంకలోని పరిస్థితిని ఎదుర్కొవాల్సి ఉంటుందన్న కొందరు అభిప్రాయాపడుతున్నారు. కేంద్రం ప్రభుత్వం ఆయా రాష్ట్రాలపై కఠిన ఆంక్షలు విధిస్తే.. ఆ రాష్ట్రాలు తమ ప్రస్తు రుణాలను కూడా తిరిగిచెల్లించలేని పరిస్థితులు తలెత్తుతాయి అంటూ ప్రముఖ వెబ్ సైట్ ‘దిప్రింట్’ కథనం వెలువరించింది.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారిన వైనం గురించి చర్చించారని ఆ వెబ్ సైట్ ఓ కథనంలో పేర్కొంది. ఆయా రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితులను సరిదిద్దుకోకుండా ఉచిత పథకాలు అమలు చేస్తే శ్రీలంక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపినట్లు ప్రింట్ కథనం ఉదహరించింది.శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి పంజాబ్ , బిహార్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఏపీ, రాష్టాలు మేల్కొవడానికి కా? ఉచిత పథకాలు, అప్పులకు ఎందుకు కోత పెట్టాలి? అనే శీర్షికన పై కథనం ప్రచురించింది. అయితే ఈ రాష్ట్రాలు శ్రీలంక పరిస్థితి చూసి ఏమి నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి. దానికి గల కారణాలు తెలిపింది.
పలు రాష్ట్రాలు ఉచిత పథకాల కోసం, ఇతర అభివృద్ధి పనుల కోసం స్థాయికి మించి రుణాలు చేస్తున్నాయి. అందుకు ఉదాహరణ ఇటీవల ఎన్నికలు జరిగిన పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక ప్రజాకర్షక పథకాలు ప్రకటించడమే. ప్రస్తుత అప్పులకు అవి కూడా తోడయితే వాటి పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. GSDPలో 53 శాతం అప్పులు చేసిన పంజాబ్ పరిస్థితి దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అత్యంత దారుణంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో గత అయిదేళ్లలో 5 శాతం పెరుగుదల ఉంటే.. వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదల రేటు 6 శాతానికి పెరిగిందని కాగ్ లెక్కలు చెబుతున్నాయి.ఆంధ్రప్రదేశ్, బిహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల అప్పుల పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయా రాష్ట్రాల్లో రుణాల తిరిగి చెల్లింపునకు సరైన ప్రణాళికలు లేవు.. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని గతంలో కాగ్ విమర్శించింది. ఈ పరిస్థితుల్లో అప్పులపై కేంద్రం ఆంక్షలు విధిస్తే ఆయా రాష్ట్రాల పరిస్థితి ఏమిటని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల నియంత్రణ చేయకపోతే శ్రీలంక గతే పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.