తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. అంతలా గ్యాప్ ఏర్పరుచుకుని గవర్నర్ ని అవమానిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంపై గవర్నర్ తమిళి గత కొన్ని రోజులుగా స్పందిస్తూ అవమానిస్తున్నారనే విధంగగా కామెంట్స్ చేశారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ అక్కడే కేసీఆర్ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు.
ఇది కూడా చదవండి: జగన్ మోహన్ రెడ్డికి బాలినేని రిటర్న్ గిఫ్ట్!
ఇక మంగళవారం ఆమె మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం నాకు పెద్ద సవాల్ అని, సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకం చేయడానికి నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ను ఏమికానని మండిపడ్డారు. నన్ను వేరే రాష్ట్రానికి మారుస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, ఢిల్లీ వెళ్లిన వెంటనే నాపై ఇలా అసత్య ప్రచారం చేశారని గవర్నర్ తెలిపారు.
సీఎం, గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా ఉంటుందో తెలంగాణను చూస్తే తెలుస్తుందని ఆమె అన్నారు. ఇక రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారని ఇప్పుడు గవర్నర్‌గా ఉన్న నాపై విమర్శలు చేస్తున్నారని తమిళి సై అన్నారు. తాజాగా సీఎంకేసీఆర్ సై గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.