రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. నాయకులు ప్రతిష్టను దిగజార్చడానికి ఎలాంటి ప్రచారానికి అయినా వెనకాడటం లేదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి తప్పుడు వార్తలకు వెంటనే చెక్ పెట్టగలుగుతున్నాం. తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఓ తప్పుడు వీడియో ఇలానే ప్రచారం అవుతోంది. ఆ వివరాలు..
జనసేన పార్టీని 2014, మార్చి 14న ప్రారంభించారు అధ్యక్షడు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది మార్చి 14తో పార్టీ స్థాపించి.. 9 ఏళ్లు పూర్తయ్యాయి. జనసేన పదో ఏడులోకి అడుగుపెడుతున్న సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో.. జనసేన ఆవిర్భావ సభ నిర్వహించారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. భారీ జనసందోహం కారణంగా విజయవాడ-మచిలీపట్నం హైవే మీద గంటలతరబడి ట్రాఫిక్ జాం అయ్యింది. వారాహి మీద యాత్రగా బయలుదేరిన పవన్ కళ్యాణ్‌కు.. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతూ.. హారతులు ఇస్తూ.. దిష్టి తీస్తూ స్వాగతం పలికారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోవాల్సిన పవన్ కళ్యాణ్.. భారీ జనసందోహం కారణంగా నాలుగంటలు ఆలస్యంగా చేరుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో సభ ముగిసింది.
పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలి వచ్చి సభను విజయవంతం చేశారు. ఈ మీటింగ్‌లో పవన్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తన వ్యూహం గురించి వివరించారు. మరోసారి వైసీపీ వ్యతిరేక ఓటను చీలనివ్వనని స్పష్టం చేశారు. అలానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అసెంబ్లీలో అడుగుపెడతానని పవన్ ధీమా వ్యక్తం చేశారు. తనతో పాటు పోటీ చేసిన అందరూ గెలిచేలా ఈ సారి జనసేన వ్యూహం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సభా వేదిక మీదుగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆయన రూ.లక్ష ఆర్ధిక సాయం అందించారు. ఈ క్రమంలో బాధిత రైతు కుటుంబాలు ఒక్కొక్కరు స్టేజీ మీదకు వచ్చి.. పవన్ చేతులు మీదగా చెక్ అందుకున్నారు.
ఈ సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ కౌలు రౌతు కుటుంబానికి చెక్ అందిస్తున్నారు పవన్ కళ్యాణ్. చెక్ అందుకోవాడానికి మహిళతో పాటు చిన్న బాబు కూడా స్టేజీ మీదకు వచ్చాడు. దాంతో పవన్ ఆ బాబును దగ్గరకు తీసుకుని ఎత్తుకున్నాడు. అయితే ప్రత్యర్థులు కొందరు.. దీనికి మరో వీడియోని ఎడిట్ చేసి.. పేదలపై పవన్ ప్రేమ ఇది అంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. పేద పిల్లాడిని దగ్గరు తీసుకున్న తర్వాత పవన్.. శానిటైజర్‌తో చేతులు కడుకున్నట్లు ఉన్న వీడియోని దీనికి జత చేసి.. తప్పుడు ప్రచారానికి దిగారు. రెండు వేర్వేరు వీడియోలను ఎడిట్ చేసి పవన్‌ను అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం చేశారు. కానీ జనసేన కార్యకర్తలు అది ఎడిటెడ్ వీడియో అని.. క్లారిటీ ఇచ్చారు.
ఇక గతంలో చిరంజీవి విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. దీని గురించి ఆయనే కొన్ని నెలల క్రితం వివరించారు. మీడియా వాళ్లు తన గురించి ఎలా తప్పుడు ప్రచారం చేశారో చెప్పుకొచ్చారు చిరంజీవి. ‘‘నేను ప్రజా అంకిత యాత్ర చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. నేను ప్రజల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడి.. షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాను. అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి వేరే స్టేషన్‌కు వెళ్లాలి. దాంతో బస్సులో కూర్చున్నాను. అప్పటికే కొన్ని మీడియా సంస్థలు మా వెనకే ఫాలో అవుతూ వస్తున్నాయి. మా మీద ప్రేమతో కాదు.. మేం ఎక్కడ తప్పు చేస్తామా.. దాన్ని పట్టుకుని ప్రచారం చేద్దామా అన్నట్లు ఎదురు చూస్తుంటాయి. అందుకే మా వెనకే వచ్చాయి’’ అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
‘‘అప్పట్లో మూడు, నాలుగు మీడియా సంస్థలు నా గురించి వ్యతిరేక వార్తలు రాసేవి. ఇక నేను బస్సులో ఫ్రంట్‌లో కూర్చొని ఉన్నాను. శానిటైజర్ ఇవ్వమని అడిగాను. ఎందుకంటే.. నా వెనక కూర్చున్న వ్యక్తి.. తినడానికి ఖర్జురాలు ఇచ్చాడు. దాంతో చేయి కడుక్కుని.. వాటిని తీసుకుని.. తినడం కోసం.. శానిటైజర్‌తో చేతులు కడుకున్నాను. కానీ సదరు చానెల్ మాత్రం.. మొత్తం ఎత్తేసి.. నేను షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియోని.. ఆ తర్వాత శానిటైజర్ వాడటం మాత్రమే చూపించారు. ఒక్కటి కాదు నాలుగైదు మీడియా సంస్థలు ఇదే చూపించాయి. ఆ వీడియో చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎంత బాగా ఎడిట్ చేశారు అనిపించింది’’ అని గుర్తు చేసుకుని నవ్వుకున్నారు చిరంజీవి.
సేమ్ ఇప్పుడు ఇదే సీన్ పవన్ కళ్యాణ్ విషయంలో జరిగింది. రెండు వేర్వేరు సందర్భాల్లో జరిగిన సంఘటనలను ఎడిట్ చేసి.. పవన్‌ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది ఎడిటెడ్ వీడియో అని స్పష్టంగా తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.