ప్రకాశం జిల్లా ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ప్రయాణికుల కారు తీసుకెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా భావించిన ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశాయి. ఇక ఇదే అంశం రాజకీయంగా కాస్త హీటెక్కిందనే చెప్పాలి. ఇక తాజాగా మాజీ మంత్రి బాలీనేని స్పందించి క్షమాపణలు తెలిపాడు.
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే.. బుధవారం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ కుటుంబం తిరుమల స్వామి వారి దర్శనం కోసం వెళుతూ మార్గ మధ్యలో ఒంగోలులో టిఫిన్ కోసం ఆగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ కోసం కారు కావాలని బుధవారం రాత్రి హోంగార్డు అక్కడికి వచ్చారు. తర్వాత కారులో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని నడిరోడ్డుపై దింపేసి.. ఆ కారును తీసుకెళ్లారు. ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ రాత్రంతా రోడ్డుపైనే ఉండిపోయింది.
తాము తిరుమల వెళుతున్నామని చెబుతున్నా వినలేదని శ్రీనివాస్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ సీఎం కాన్వాయ్‌కు కారు కావాలంటే.. స్థానికంగా ఉండే వారిది తీసుకెళ్లాలి.. కానీ ఇలా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. ఇక ఇదే ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: అలా అయితే.. TDP ప్రతిపక్షంలోనే ఉండిపోతుంది: చంద్రబాబు!
దీంతో వెంటనే స్పందించారు మాజీ మంత్రి బాలినేని. శ్రీనివాస్ కారు తీసుకెళ్లిన ఘటనకు బాద్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం తరపున క్షమాపణ చెబుతున్నామన్నారు. ఇలాంటివి పునరావృతం కావద్దని అధికారులను ఆదేశించామని అన్నారు. ఆ కుటుంబం తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత ఒంగోలు వస్తే కారును తిరిగి అప్పగిస్తామన్నారు మాజీ మంత్రి బాలినేని. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.