బుధవారం హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటలతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, జితేందర్ రెడ్డిలతో పాటు పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అయితే భూ కబ్జా ఆరోపణలలో టీఆర్ఎస్ ఆయనను బర్త్ రఫ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. ఇక ఈ క్రమంలో హుజురాబాద్ ఉప ఎన్నికకు అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని అధికార పార్టీతో పాటు మిగతా పార్టీలన్నీ పోరుకి సై అన్నాయి. దీంతో ఇటీవల హుజురాబాద్ నియోజవర్గానికి ఉప ఎన్నిక కూడా జరిగింది. ఇందులో ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్ధిపై అధిక మెజార్టీతో గెలుపొందాడు.