మినీ సార్వత్రిక ఎన్నికల్ల్లో బీజేపీ సత్తా చాటింది. 4-1 తేడాతో ప్రత్యర్థి పార్టీలపై ఘన విజయం సాధించింది. ఒక్క పంజాబ్ లో మాత్రం ఓటమి చవిచూసింది. ఆ విషయం పక్కనబెడితే ఈ ఎన్నికల్లో కొన్ని జంటలు పోటీ చేసి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ విధంగా బరిలోకి దిగిన అయిదు జంటల్లో మూడు జంటలు విజయం సాధించగా.. రెండు జంటలు ఓటమి పాలయ్యాయి. ఆ జంటల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో గోవా ఒక్కటి. ఇక్కట మెజార్టీకి ఒక అడుగు దూరంలో భాజాపా ఆగిపోయింది. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇదే సమయంలో గోవా శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఐదు జంటలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మూడు జంటలు విజయాన్ని అందుకోగా, రెండు జంటలు ఓటమి పాలయ్యాయి. బీజేపీ తరపున పోటీ చేసిన రెండు జంటలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక జంట విజయాన్ని సాధించాయి. ప్రతిష్టాత్మక పణజి నియోజకవర్గం నుంచి అటానాసియో మోన్‌సెరెట్టే విజయం సాధించగా ఆయన భార్య జెన్నీఫర్.. తలైగావ్ స్థానం నుంచి విజయాన్ని నమోదు చేశారు.కాంగ్రెస్ అభ్యర్థి టోనీ ఆల్ఫ్రెడో రోడ్రిగ్స్ పై 2041 ఓట్ల ఆధిక్యంతో జెన్నీఫర్ విజయం సాధించారు.
భాజపా నేత ప్రతాప్ సింగ్ రాణే.. వాల్పోయి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన సతీమణి దేవీయ విశ్వజిత్ రాణే.. పోరియం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. దేవీయ 13 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం విశేషం.ఇక మూడు జంట మైఖేల్ విన్సెంట్, డెలిలా మైఖేల్ లోబో. కాంగ్రెస్ అభ్యర్థిగా మైఖేల్..కలన్ గుట్ స్థానం నుంచి విజయం సాధించగా ఆయన భార్య డెలిలా. సియోలియ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు.ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్, ఆయన సతీమణి సావిత్రి కవ్లేకర్ ఇద్దరు ఓటమి పాలయ్యారు. సంగెం అసెంబ్లీ స్థానం నుంచి సావిత్రి.. ఇండింపెండెంట్‌గా పోటీ చేసి.. పోటీ స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కిరణ్ కండోల్కర్ దంపతులు కూడా ఓటమిపాలయ్యారు. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.