వృద్ధురాలిపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. పట్ట పగలు అందరూ చూస్తుండగానే రెచ్చిపోయారు. ఇక చేయాల్సింది అంతా చేసేసి అక్కడి నుంచి పరారయ్యారు. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా కనిపించిన అమ్మాయి, మహిళ, వృద్ధురాలు ఇలా ఎవరినీ వదలకుండా దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ముగ్గురు యువకులు పట్టపగలు దారుణానికి పాల్పడ్డారు. ఇంటి ముందు కూర్చున్న ఓ వృద్ధురాలిపై దొంగలు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
గోవాలోని లోటౌలీమ్ ప్రాంతంలో సోమవారం ఓ వృద్దురాలు ఇంటి ముందు ఒంటరిగా కూర్చుంది. దీంతో ముగ్గురు యువకులు అటు నుంచి వచ్చి ఆ ముసలవ్వపై కన్నేశారు. ఆమె వద్ద ఉన్న బంగారు గాజులు దొంగిలించాలని ప్లాన్ వేశారు. ఇక ప్రణాళిక ప్రకారమే..ముందుగా ఇద్దరు యువకులు ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి మాటలు కలిపారు. ఆ తర్వాత మెల్లగా ఆమె చేతులకు ఉన్న బంగారు గాజులు బలవంతంగా తీసుకున్నారు. అనంతరం మరో యువకుడు బైక్ పై రావడంతో ముగ్గురు దొంగలు కలిసి అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిని చూసిన కొందరు.. వృద్ధురాలు అని కూడా చూడకుండా ఎంత దారుణానికి పాల్పడ్డారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి దుండగులను పట్టికుని శిక్షించాలంటూ వాపోయారు.
— Hardin (@hardintessa143) May 23, 2023