గత కొంత కాలంగా రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సహా.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తాజాగా రేషన్ కార్డుదారులు చేసిన చిన్న పొరపాటు వల్ల ఏకంగా 80 వేల రేషన్ కార్డులను రద్దు చేసింది ప్రభుత్వం.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రేషన్ కార్డుల ద్వారా తక్కువ ధరలకే నిత్యవసర వస్తువులను ప్రభుత్వాలు అందిస్తుంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డుల్లో అవకతవకలు జరుగుతున్న విషయాలను ప్రభుత్వాలు గుర్తించాయి. దాంతో రేషన్ కార్డుల జారీల విషయాల్లో, ఇతర విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అర్హత లేకుండా ఉచిత రేషన్ కార్డులు తీసుకుంటున్న వారిపై కేంద్రం ప్రత్యేక నిఘా ఉంచింది. ఇక తాజాగా రేషన్ కార్డుదారులు చేసిన చిన్న పొరపాటు వల్ల ఏకంగా 80 వేల రేషన్ కార్డులను రద్దు చేసింది ప్రభుత్వం.
రేషన్ కార్డుల జారీ, అందులో జరుగుతున్న అవకతవకలపై క్రేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక నిఘా పెట్టాయి. అందులో భాగంగానే రేషన్ కార్డుదారులు చేసిన చిన్న పొరపాటు వల్ల ఏకంగా 80 వేల రేషన్ కార్డులను రద్దు చేసింది గోవా ప్రభుత్వం. గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారి రేషన్ కార్డులను రద్దు చేసింది. వారి స్థానంలో కొత్త వారికి రేషన్ కార్డులను జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. రద్దు చేసిన కార్డు హోల్డర్లు గత 2022 ఆగస్టు నుండి 2023 జనవరి వరకు తమ రేషన్ తీసుకోలేదు. దాంతో రేషన్ తీసుకోని వారి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల డైరెక్టర్ గోపాల్ పర్సేకర్ తెలిపారు.
అయితే రేషన్ కార్డుదారులు ఇంత పెద్ద మెుత్తంలో ఎందుకు రేషన్ తీసుకోట్లేదో కూడా డిపార్ట్ మెంట్ విచారణ చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో 13.32 లక్షల మంది రేషన్ కార్డ్ దారులు ఉన్నారని, వీరిలో 80 వేల మంది రేషన్ కార్డులు రద్దు కావడం పెద్ద విషయంగానే మేము భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక తమ ఇష్ట పూర్వకంగా కార్డు రద్దు చేసుకున్నవారు, తమ కార్డును మళ్లీ జారీ చేసుకోవచ్చని పర్సేకర్ తెలిపారు. మరి గోవా ప్రభుత్వం 80 వేల రేషన్ కార్డులను రద్దు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.