ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ కోసం కృషి చేస్తున్నారు. ఆయన అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాల పథకాలతో ఆర్థిక భరోసాను అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ కోసం కృషి చేస్తున్నారు. ఆయన అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాల పథకాలతో ఆర్థిక భరోసాను అందిస్తున్నారు. రైతులకు, మహిళలకు, యువత, విద్యార్థులకు తరచూ ఏదో ఒక శుభవార్త జగన్ సర్కార్ చెబుతుంది. అలానే తాజాగా ఏపీలోని రేషన్ కార్డు దారులకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మరి.. ఈ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన పరిపాలను ఎన్నో ఆ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ఇలా నవరత్నాల పేరుతో ఎన్నో సంక్షేమ పథాలను ప్రజలకు చేరువ చేశారు. తాజాగా బియ్యం కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ నిత్యావసరాలను అందించేందుకు సిద్ధమైంది. జూన్ 1 నుంచి రాయలసీమ జిల్లాల్లో రాగులు పంపిణీ చేయనున్నారు.
ఇందులో భాగంగా ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చక్కెరతోపాటుగా రాగులను కూడా అందిచనున్నారు. ఉచిత బియ్యానికి బదులు కార్డుపై 3 కేజీల వరకు రాగులను ఉచితంగానే అందజేస్తామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ తెలిపారు. రాయలసీమలోని ఇతర జిల్లాల్లో జూలై నుంచి రాగుల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ వచ్చిన స్పందన తరువాత దశలవారీగా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకూ విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఐక్యరాజ్య సమితి 2023ను చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోంది.
నిజానికి రేషన్‌కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నంద్యాల జిల్లాలో జొన్నలు పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రాగుల పంపిణీ కూడా చేపట్టనున్నామని వివరించారు. రాగులు వద్దనుకునే రేషన్ కార్డు దారులు యథావిధిగా బియ్యం తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు, గోధుమ పిండి, జొన్నలు పంపిణీ చేస్తుండగా.. తాజాగా రాగులు కూడా వచ్చి చేరాయి. రేషన్ కార్డుదారులు కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మరి.. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.