దేశంలో కరోనా కష్టాలు తిరినా.. నిత్యాసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.. వాటికి తగ్గట్టు పెట్రోల్, డీజిల్ తో పాటు నిత్యం వినియోగించే గ్యాస్ ధరలు కూడా చుక్కలనుంటుకుంటున్నాయి. ఇది సామాన్య ప్రజలకు పెను భారంగా మారిపోయింది.
గత కొంత కాలంగా రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సహా.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తాజాగా రేషన్ కార్డుదారులు చేసిన చిన్న పొరపాటు వల్ల ఏకంగా 80 వేల రేషన్ కార్డులను రద్దు చేసింది ప్రభుత్వం.
ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు.. ఉచితంగా నిత్యావసర సరకులు అందించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డులను ప్రవేశ పెట్టింది. అందుదలో భాగంగానే ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేస్తోంది. అయితే రోజులు గడుస్తోన్న కొద్ది ఈ రేషన్ కార్డుల విషయంలో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. ఈ అవకతవకల వల్ల అర్హులు నష్టపోయి.. అనర్హులు లాభపడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో లోపాలను సరిదిద్ది కేవలం అర్హులే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా కోన్ని నిబంధనలు తీసుకోచ్చింది. ఈ […]
తెలంగాణలో రేషన్ అందుకుంటున్న పేద ప్రజలకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు మాసం నుంచి లబ్దిదారులకు పదిహేను కిలోల చొప్పన ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా సంక్షోభం నుంచి లబ్దిదారులకు ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత […]
కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని ఆటోవాలాలు, ట్యాక్సీ వాలాలకు రూ.5000 చొప్పున వారి వారి అకౌంట్లలో వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలరూపాయల ఆర్ధిక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఈ సాయాన్ని అందజేస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. దీనివల్ల వారు కొంతవరకైనా తమ ఆర్ధిక నష్టాల నుంచి బయటపడతారని […]