అనంత్ శ్రీరామ్ చిన్న వయస్సులోనే సినిమా పరిశ్రమలోకి వచ్చాడు. సుమారు 18 ఏళ్ల కెరీర్‌లో 1300 పాటలకు పైగా లిరిక్స్ అందించారు. ఆయన లిరిక్స్ అందించిన చాలా పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అనంత శ్రీరామ్ ఇటీవల వివాదాల్లో నిలుస్తున్నారు.
టాలీవుడ్ పరిశ్రమలో ఎంతో మంది గేయ రచయితలు (లిరిసిస్ట్) ఉన్నారు. వారిలో ఒకరు అనంత శ్రీరామ్. అనేక సినిమాలకు గేయ రచయితగా పనిచేశారు. చాలా కూల్ అండ్ సాఫ్ట్ గా కనిపించే ఈ గోదావారి కుర్రాడు.. చిన్న వయస్సులోనే సినిమా పరిశ్రమలోకి వచ్చాడు. సుమారు 18 ఏళ్ల కెరీర్‌లో 1300 పాటలకు పైగా లిరిక్స్ అందించారు. ఆయన లిరిక్స్ అందించిన చాలా పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. పద ప్రయోగాలు చేస్తూ, చమక్కులతో పాటలు రాయడంలో ఆయన దిట్ట. అయితే లిరిసిస్ట్‌గానే కాకుండా ఓ పాటల కార్యక్రమానికి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడ తనలోని టాలెంట్‌ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు అనంత్ శ్రీరామ్.
అనంత శ్రీరామ్ ఇటీవల వరుస వివాదాల్లో నిలుస్తున్నారు. మొన్నటి మొన్న గరిక పాటినుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసి.. కావాలనే వ్యాఖ్యానించానన్నారు. సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ శ్రీరామ్.. భట్రాజు అనే పదం వాడటంతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఓ బిగ్ బాస్ బ్యూటీతో కలిసి ఆయన గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో దివి, అనంత్ శ్రీరామ్ ఒకే ఫ్రేములో ఉన్నారు. మిస్టర్ ఫర్పెక్ట్ సినిమాలోని చలి చలిగా అల్లింది అనే పాటను పాడుతుంటే.. దివి కోరస్ అందుకుంది. దాన్ని ఆమె వీడియో తీస్తోంది.
మరి వీళ్ళేమైనా సినిమా షూటింగ్లో భాగంగా వెళ్ళారా? లేక బుల్లితెర ప్రోగామ్ ఏదైనా ప్లాన్ చేశారా లేదా ఏదైనా టూర్ కు వెళ్ళారా అన్నది తెలియాల్సి ఉంది.జీ టీవీలో ప్రసారమౌతున్న సరిగమపలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు అనంత్ శ్రీరామ్. ప్రస్తుతం పలు సినిమాలకు వర్క్ చేస్తున్నారు. అటు దివి కూడా బిగ్ బాస్ హౌస్ లో నుండి వచ్చాక అడపా దడపా సినిమాలతో అలరిస్తుంది. ‘క్యాబ్ స్టోరీస్’, ‘లంబసింగి’ అనే చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే, ‘నయీం డైరీస్’ మూవీలో దివి చేసిన హాట్ సీన్ వల్ల సెన్సేషన్ అయింది. ఇక, గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీలో దివికి ఛాన్స్ ఇచ్చారు. ఈ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.ఫిల్మ్ ‘పుష్ప ది రూల్’లో ఆమె ఓ జర్నలిస్టు పాత్రను చేస్తోంది.
ప్రముఖ రచయితతో బిగ్ బాస్ బ్యూటీ.. అతనితో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తూ వీడియో!#AnantaSriram #DiviVadthya #Goa #GoaVibes #Tollywood #ViralVideo #FilmiBeatTelugu pic.twitter.com/CVQ2ehTAYj
— TeluguFilmibeat (@TeluguFilmibeat) April 20, 2023