ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సాఆర్సీపీలోకి చేరికలు పెరిగాయి. ముఖ్యంగా యువత వైసీపీలోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సీఎం జగన్ పరిపాలనకు ఆకర్షితుడైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ నేత ఒకరు వైసీపీ కడువా కప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సాఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజు నుంచి ప్రజలకు సుపరిపాలన అందిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఒకవైపు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే మరొక వైపు అనేక కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసి.. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజాపాలనకు ఆకర్షితులై, అభివృద్ధిలో తాము భాగస్వాములం అవుతామని పెద్ద ఎత్తున యువత, ఇతర పార్టీల నాయకులు వైసీపీ లో చేరారు. తాజాగా ప్రముఖ యువనేత బరాతం సంతోష్ కూడా మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో వైసీపీలోచేరారు.
ఏపీలో ఎన్నికలలు దగ్గర పడుతున్న కొద్ది వైసీపీ లోకి వలసలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు ఆకర్షితులైన యువత పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన నచ్చి.. యువతతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు వైసీపీలో చేరారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ చేరికలు ఇంకా పెరిగాయి. వైసీపీలో చేరేందుకు యువత ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ప్రముఖ యువనేత, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి బరాతం సంతోష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ అందిస్తున్న ప్రజాపాలనకు ఆకర్షితుడై బరాతం సంతోష్ వైకాపాలో చేరారు. రాష్ట్రమంత్రి, శ్రీకాకుళం జిల్లా కు చెందిన ప్రముఖ నేత ధర్మాన ప్రసాదరావు సమక్షంలో బరాతం సంతోష్ వైఎస్సాఆర్సీపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు యువత ఆకర్షితులవుతున్నారని తెలిపారు. జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి ధర్మాన తెలిపారు. ఈ సందర్భంగా బరాతం సంతోష్ తో పాటు సీఎం జగన్ అందిస్తున్న ఆదర్శవంతమైన పరిపాలనను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు యువకులు పార్టీలో చేరారు. ఎన్నికలు దగ్గర పడేకొద్ది భారీ చేరికలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి.. ఇలా పెద్ద ఎత్తున యువత వైసీపీ పార్టీలో చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.