Bandla Ganesh, Vijayasai Reddy: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. శుక్రవారం ట్విట్టర్ వేదికగా తనపై చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి ఘాటు రిప్లై ఇచ్చారు. శనివారం తన ట్విట్టర్ ఖాతాలో విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. ‘‘ ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా!’’ అని పేర్కొన్నారు. దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ. ‘‘ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీ వెనకాల లేకపోతే నీ చరిత్ర ఏంటో.. నీవు ఏంటో నీ బ్రతుకు ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకో తెలుస్తోంది.. మీ దగ్గర అధికారం ఉంది దొంగసాయి గారూ.. అరెస్ట్ చేయిస్తారో కేసులు పెట్టిస్తారో.. కొట్టిస్తారో ఇంకెన్నేన్ని చేస్తారో.
అయినా మీతో నేను పోరాడుతూనే ఉంటా దొంగ సాయి గారు. ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యానవనంలో మొలసిన గంజాయి మొక్క మీరు.. ఆ గంజాయి మొక్కను పీకేసే ఒక తెలుగువాడిగా నా కర్తవ్యం. యస్ నేను కుక్కనే గర్వంగా చెప్పుకుంటా నాకు అన్నం పెట్టి, బతుకుని ఇచ్చిన విశ్వాసం గల కుక్కని నీ లాగ పిచ్చి కుక్కని, గజ్జి కుక్కని, మోసపు కుక్కని కాదు దొంగ సాయి గారు’’ అని అంటూ మరో సారి వరుస ట్వీట్లు చేశారు. కాగా, విజయసాయి రెడ్డి ‘‘టీడీపీ’’ని కమ్మ పార్టీ అనటంతో ఈ వివాదం చెలరేగింది. విజయసాయి వ్యాఖ్యల్ని బండ్ల గణేష్ తీవ్రంగా తప్పు బట్టారు. తన కులాన్ని మధ్యలోకి లాగొద్దంటూ ఆయనపై ఫైర్ అయ్యారు. తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లతో మండిపడ్డారు. మరి, బండ్ల గణేష్, విజయసాయి రెడ్డి ట్విటర్ వార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022
యస్ నేను కుక్క నే గర్వం గా చెప్పుకుంటా నాకు అన్నం పెట్టి బతుకుని ఇచ్చిన విశ్వాసం గల కుక్కని నీ లాగ పిచ్చి కుక్కని గజ్జి కుక్కని మోసపు కుక్క ని కాదు దొంగ సాయి గారు
— BANDLA GANESH. (@ganeshbandla) April 16, 2022
ఇవి కూడా చదవండి. చెప్పు దెబ్బలు ఖాయం అంటూ.. విజయసాయి రెడ్డికి బండ్ల గణేష్ హెచ్చరిక!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.