సందేశం దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి తాజాగా రిలీజయింది. ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏ సినిమాకి పెట్టిన దేవర అనే టైటిల్ నాదే అంటున్నాడు బండ్ల గణేష్.
సందేశం దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అలనాటి శ్రీ దేని కూతురు జాహ్నవి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా..మ్యూజిక్ సంచలనం అనిరుద్ ఏ సినిమాకి బాణీలందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి తాజాగా రిలీజయింది. ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏ సినిమాకి పెట్టిన దేవర అనే టైటిల్ నాదే అంటున్నాడు బండ్ల గణేష్. మరి ఈ టైటిల్ వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.
తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా “ఎన్టీఆర్ 30”. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్లే ఎన్టీఆర్ ఊర మాస్ లుక్ తో అభిమానులని ఖుషి చేసే పనిలో ఉన్నాడు. రెండు నెల్ల క్రితం గ్రాండ్ గా పూజ కార్యక్రమాలు జరుపుకొని సెట్స్ మీదకి వెళ్లిన ఈ సినిమా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేసారు. అయితే టైటిల్ ఇలా రిలీజ్ చేశారో లేదో అప్పుడే ఈ సినిమా మీద బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ న్నీ ఈ మాజీ నిర్మాత దేవుడిలా కొలుస్తారనే పేరుంది.
దేవర టైటిల్ తో పవన్ కళ్యాణ్ తో మూవీ నిర్మించాలనేది ఆయన డ్రీమ్. పవన్ ని ఆరాధించే బండ్ల గణేష్ ఆయన్ని దేవర అని పిలుచుకుంటారు. ఆ టైటిల్ పవన్ కళ్యాణ్ కి బాగా సూట్ అవుతుందని ఆయన నమ్మకం. రిజిస్టర్ అయితే చేయించాడు కానీ దాన్ని రెన్యువల్ చేయించడం మర్చిపోయాడు. ఇది బండ్ల గణేష్ రిజిస్టర్ చేసుకున్న టైటిల్ అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ తాజాగా దేవర అనే సినిమా టైటిల్ పెడుతున్నారని తెలిసి కాస్త అసహనం వ్యక్తం చేశారు. ” ఈ టైటిల్ నేను రిజిస్టర్ చేయించుకున్నాను. కాకపోతే రెన్యువల్ చేయడం మర్చిపోవడంతో కొట్టేశారు”. అని కామెంట్ పోస్ట్ చేశారు. మొత్తానికి దేవర టైటిల్ ఎన్టీఆర్ చిత్రానికి వాడుకున్నందుకు బండ్ల గణేష్ కోపంగా ఉన్నారని అర్థమైంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023