జనవరి అనగానే అందరికీ సంక్రాంతి, ఆ టైంలో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలే గుర్తొస్తాయి. ఈసారి కూడా అందుకు తగ్గట్లే చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ లాంటి సినిమాలతో పాటు ‘వారసుడు’, ‘తెగింపు’ లాంటి డబ్బింగ్ మూవీస్ థియేటర్లలో విడుదలవుతున్నాయి. అయితే అందరికీ పండక్కి థియేటర్ కు వెళ్లడం కుదరకపోవచ్చు, తర్వాత చూద్దాంలే అనే ధీమా రావొచ్చు. అలాంటి టైంలో ఓటీటీలో కొత్త మూవీస్ ఏం రిలీజ్ అయ్యాయి అనేది చూస్తారు. అలా ఈ వారం ఏకంగా 21 సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. అందుకే తగ్గట్లే చిరు, బాలయ్య సినిమాల ట్రైలర్స్ ఫుల్ మాస్ గా ఉన్నాయి. ఈ క్రమంలోనే థియేటర్లలో ఈ సినిమాల సందడి ఎలాను ఉంటుంది. అదే టైంలో ఓటీటీలోనూ సంక్రాంతి సందడి ఎక్కువగానే ఉంది. అయితే తెలుగు డబ్బింగ్ సినిమాలతో పాటు ఇంగ్లీష్, హిందీ సినిమాలు వెబ్ సిరీసులే ఎక్కువగా విడుదల కాబోతున్నాయి. తెలుగు మూవీస్ మాత్రం ఓటీటీలో ఏవి రిలీజ్ కావట్లేదు.