రవితేజ 'రావణాసుర' మూవీ చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అందులో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మాస్ మాహారాజా రవితేజ హీరోగా నటించిన మూవీ ‘రావణాసుర’. సాధారణంగా హీరోలంటే పాజిటివ్ రోల్స్ లో కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలోని రవితేజ క్యారెక్టర్ చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. మరీ ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే.. మైండ్ పోగుడుతుంది. థియేటర్లలోకి ఈ చిత్రం చూసిన వాళ్లు.. రవితేజ యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. చూడలేకపోయిన వాళ్లు.. ఓటీటీలోకి ‘రావణాసుర’ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్లకోసమా అన్నట్లు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘రావణాసుర’ మూవీని పూర్తిగా నెగిటివ్ టచ్ ఉన్న స్టోరీతో తీశారు. అయితే ఏదైనా కొత్తగా ప్రయత్నించడానికి బదులు రొటీన్ రివేంజ్ ఫార్మాట్ ని ఎంచుకున్నారు. దీంతో రిలీజ్ కు ముందు వచ్చిన హైప్ కాస్త తొలిరోజు తర్వాత మారిపోయింది. ఫస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది కానీ తర్వాత తర్వాత కలెక్షన్స్ రాక బిలో యావరేజ్ గా నిలిచింది. చెప్పాలంటే ‘రావణాసుర’కు థియేటర్లలో నష్టాలొచ్చాయి. సరే అదంతా పక్కనబెడితే ఓటీటీలో ఈ వీకెంట్ ఏదైనా ఓ మూవీ చూడాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.
ఏప్రిల్ 7న థియేటర్లలోకి వచ్చిన ‘రావణాసుర’.. నెల తర్వాత అంటే మే ఒకటో-రెండో వారంలో వస్తుందనుకున్నారు. కానీ మూడు వారాల్లోనే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో రవితేజతోపాటు సుశాంత్ కీలకపాత్ర పోషించాడు. మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, అను ఇమ్మాన్యుయేల్, దక్షనగర్కార్ తదితర హీరోయిన్లు ఇందులో నటించడం. సో అదన్నమాట విషయం. మరి ‘రావణాసుర’ ఓటీటీలో చూడటానికి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? కింద కామెంట్ చేయండి.