ఈరోజుల్లో కొత్త సినిమాలు నాలుగు నుంచి ఎనిమిది వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. కొన్ని అయితే థియేటర్లలోకి వచ్చిన రెండు, మూడు వారాల వ్యవధిలోనే డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయిపోతున్నాయి.
‘బేబి – ది మూవీ’.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వినిపిస్తున్న పేరు. యువత అంతా థియేటర్లకు బారులు తీరేలా చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్.. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా రెండో రోజు బ్రేకీవెన్ సాధించిన దాఖలాలు లేవు. కానీ రూ. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కి, 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 38.2 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే బ్లాక్ బస్టర్ కాదు డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బేబి’. గత శుక్రవారం (జూలై 14)న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది.
ఈరోజుల్లో కొత్త సినిమాలు నాలుగు నుంచి ఎనిమిది వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. కొన్ని అయితే థియేటర్లలోకి వచ్చిన రెండు, మూడు వారాల వ్యవధిలోనే డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయిపోతున్నాయి. ‘బేబి’ ఓటీటీ పార్ట్‌నర్, స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఈ మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. అలాగే రిలీజ్ అయిన నెల (జూలై 14) రోజుల తర్వాత ఆగస్టు 15న స్ట్రీమింగ్ చెయ్యనున్నట్లు సమాచారం. హాలీడే కాబట్టి రీచ్ ఎక్కువ ఉంటుంది. ఆల్ రెడీ బిగ్ స్క్రీన్‌పై చూసిన వారు, చూడని వారు కూడా చూసే ఛాన్స్ ఉంది.
కంటెంట్ కనెక్ట్ అయితే తెలుగు ఆడియన్స్ సినిమాను ఎంతలా ఆదరిస్తారో చెప్పడానికి ఇంతకుముందు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ మూవీ ఆ విషయాన్ని మరోసారి చాలా స్ట్రాంగ్‌గా ప్రూవ్ చేసింది. కథ, కథనం, క్యారెక్టర్లు ముఖ్యంగా యువతకు బాగా నచ్చేశాయి. ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. విరాజ్ కూడా బాగా రిజిస్టర్ అయ్యాడు. రాబోయే రోజుల్లో ‘బేబి’ ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: బేబి సినిమా దర్శకుడి మాటలకు కంటతడి పెట్టిన వైష్ణవి చైతన్య!