ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బేబి’. గత శుక్రవారం (జూలై 14)న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది.
‘బేబి’.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వినిపిస్తున్న పేరు. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా రెండో రోజు బ్రేకీవెన్ సాధించిన దాఖలాలు లేవు. కానీ రూ. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కి, నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 28.60 కోట్ల గ్రాస్, అందులో కేవలం ఆంధ్ర, తెలంగాణ నుంచే రూ. 22.80 కోట్లు వసూలు చేసిందంటే బ్లాక్ బస్టర్ కాదు డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బేబి’. గత శుక్రవారం (జూలై 14)న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది.
ముఖ్యంగా హీరో క్యారెక్టర్‌తో యూత్ పోరగాళ్లంతా కనెక్ట్ అయ్యారు. జెన్యూన్‌గా లవ్ చేసి, ప్రేమ కోసం పిచ్చోడిలా తయారయ్యే పాత్ర కుర్రాళ్లకు బాగా నచ్చేసింది. ఇక వైష్ణవి చైతన్య రోల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా చూసిన వాళ్లు తిట్టుకునేంతగా ఆమె పాత్ర ఎంతగానో ఓన్ చేసుకుంది. రియల్ లైఫ్‌లో జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. అలాంటప్పుడు ఆ పాత్ర కూడా రియలిస్టిక్‌గానే ఉండాలి. ఇందులో వైష్ణవి కూడా నేచురల్‌గానే నటించింది. ఒక అమ్మాయి ప్రేమించిన వారిని మోసం చేస్తే ఎలా ఉంటుందో.. ‘బేబి’ సినిమాలో వైష్ణవిని చూస్తే తెలుస్తుంది. నిజానికి సినిమా కల్ట్ అంటున్నారు గానీ వైష్ణవి చేసిన పాత్రను కూడా కల్ట్ అనే అనాలి.
సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా ‘బేబి కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ నిర్వహించారు మేకర్స్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ స్టేజ్ మీద డైరెక్టర్ సాయి రాజేష్ మెయిన్ లీడ్స్ గురించి మాట్లాడుతూ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి, సినిమా అగ్రిమెంట్ చేస్తున్నప్పటి నుంచి సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసింది అనే విషయాలు చెప్తుండగా భావోద్వేగానికి గురైన వైష్ణవి కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: రూ.700 కోసం బేబీ హీరోయిన్ రోజంతా కష్టం! కన్నీళ్లు పెట్టించే నిజం!