వైష్ణవి చైతన్య.. ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ మార్మోగిపోతుందీ పేరు. ఈవెంట్లలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఇన్‌స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
వైష్ణవి చైతన్య.. ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ మార్మోగిపోతుందీ పేరు. ఈవెంట్లలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఇన్‌స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ‘బేబి’ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ప్రీమియర్స్ నుండే అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. అబ్బాయిలు, అమ్మాయిలు వైష్ణవి చేసిన క్యారెక్టర్ని తిట్టుకుంటున్నారంటే తను ఎంతలా ఆ పాత్రలో లీనమై నటించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే సోషల్ మీడియా నుండి సిల్వర్ స్క్రీన్ వరకు జరిగిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి.
సినిమాలతో గుర్తింపు వస్తే, అవకాశాలతో పాటు డబ్బు కూడా వస్తుంది కానీ కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. వైష్ణవి కూడా పలు సినిమా కష్టాలు చవిచూసింది. రీసెంట్గా ఓ ఇంటర్వూలో తన తొలి సంపాదన గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందామె. వైష్ణవి చైతన్యది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. ఆడియో లాంచ్, పెళ్లిళ్లు, డ్యాన్స్ ఈవెంట్లకు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా వెళ్లేది. ఆమెకు వచ్చే ఆ కొద్దిపాటి ఆదాయంతోనే ఇళ్లు గడిచేది. ఓ డ్యాన్స్ ఈవెంట్ దగ్గర కాస్టింగ్ వాళ్ల నంబర్ దొరికితే వారిని కాంటాక్ట్ అయ్యింది. అలా మొదటిసారి షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది.
డ్యాన్స్ అంటే చాలా ఇష్టమున్న వైష్ణవి క్లాసికల్‌తో పాటు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. స్కూలు, కాలేజీలో ఏ ఈవెంట్ జరిగినా అందులో తన డ్యాన్స్ ఉండాల్సిందే. 15 ఏళ్ల వయసులోనే ఆఫర్ల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో తెలిసిన వాళ్ల దగ్గర అప్పు తీసుకుని మరీ ఆడిషన్స్‌కి వెళ్లేది. ఆడిషన్ చేశాక ‘తర్వాత చెప్తాం’ అనేవారు. కానీ తర్వాత పిలిచేవారు కాదు. దీంతో ఏడ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘అల వైకుంఠపురములో’, ‘టచ్ చేసి చూడు’ లాంటి చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది.
ఇంత కష్టపడ్డ వైష్ణవి చైతన్య తొలి సంపాదన ఎంతో తెలుసా?. వెయ్యి రూపాయలకంటే తక్కువే. ఓ ఈవెంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యాన్స్ చేస్తే ఏడు వందల రూపాయలు ఇచ్చారు. ఆమెకు అదే ఫస్ట్ రెమ్యునరేషన్. ఆ డబ్బులు అందుకొన్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్, భావోద్వేగానికి గురయ్యానని, జీవితంలో ఎంతో సంపాదించొచ్చు కానీ ఆ ఏడొందలు తనకు అపురూపమైనవేనని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ‘బేబి’ మూవీతో హీరోయిన్ కావాలనే తన కల నెరవేర్చుకుంది. ఈ సినిమా నిర్మాతతో ఏకంగా మూడు (బేబి కాకుండా మరో రెండు) సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. కష్టపడుతూ, వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ ముందుకెళ్తే.. కచ్చితంగా ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం అనే మెసేజ్ ఈ జనరేషన్ వారికి ఇస్తుంది వైష్ణవి చైతన్య జర్నీ.