బేబీ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్యను నెటిజన్స్, ప్రేక్షకులు బూతులు తిడుతున్నారు. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత స్వయంగా వెల్లడించారు. అసలు వైష్ణవి చైతన్యను తిట్టడానికి కారణం ఏంటి?
వైష్ణవి చైతన్య ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోయిన్ గా చేసిన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కాబట్టి. అందులోనూ ఆమె చేసిన పాత్రకు పేరొచ్చింది కాబట్టి ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తుంది. అందరిలానే చాలా సాధారణ కుటుంబానికి చెందిన వైష్ణవి చైతన్య టిక్ టాక్ వీడియోల ద్వారా తన టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. అలా ఆమె పాపులర్ అవ్వడంతో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, ఆ తర్వాత వెబ్ సిరీస్ లు చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్, నితిన్, నాని, నాగశౌర్య వంటి హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలవైకుంఠపురము సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా ఆమె నటన ఎంత క్యూట్ గా ఉంటుందో మనం చూశాం.
అయితే ఇప్పటి వరకూ చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన వైష్ణవి చైతన్య తొలిసారిగా బేబీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఇంతలా ఆమె రేంజ్ పెరిగిపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత ఆమెను తిడుతున్నారు. ఈ విషయాన్ని బేబీ నిర్మాతే స్వయంగా చెప్పుకొచ్చారు. అంతలా బూతులు తిట్టడానికి బేబీ సినిమాలో ఆమె చేసిన పాత్రే కారణం. అవును ఆమె చేసిన క్యారెక్టర్ అటువంటిది. సినిమా చేసిన నటుడు లేదా నటి తాము పోషించిన పాత్ర నుంచి బయటకొచ్చేసినా గానీ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం చేసిన వారిని ఇంకా ఆ పాత్రల్లో ఊహించుకున్నప్పుడే తెలుస్తుంది. ప్రేక్షకులు పాత్రను ఎంత ఓన్ చేసుకోకపోతే ఆ పాత్ర తాలూకు ప్రభావం వారి మీద ఉంటుంది చెప్పండి.
పాత రోజుల్లో అప్పటి సినిమాల విలన్లను జనాలు తిట్టుకునేవారు. విలన్ పాత్రలు పోషించిన నటులు రోడ్డు మీద కనబడితే ముఖం మీదనే తిట్టేసేవారు. దాన్ని ప్రశంసలుగా తీసుకునేవారు. అలాంటి ప్రశంసలు ఇప్పుడు బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్యకు దక్కుతున్నాయి. తిట్లే కానీ అవి ఆమె పాత్రకు దక్కిన గౌరవం. ఆమె పాత్రను ఎంతగానో ఓన్ చేసుకుంటేనే గానీ తిట్టడానికి మాటలు రావు. రియల్ లైఫ్ లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. అలాంటప్పుడు ఆ పాత్ర కూడా రియలిస్టిక్ గానే ఉండాలి. చాలా సహజంగా ఉండాలి. ఇందులో వైష్ణవి కూడా అలానే నటించారు. ఒక అమ్మాయి ప్రేమించిన వారిని మోసం చేస్తే ఎలా ఉంటుందో.. బేబీ సినిమాలో వైష్ణవిని చూస్తే తెలుస్తుంది. నిజానికి సినిమా కల్ట్ అంటున్నారు గానీ వైష్ణవి చేసిన పాత్ర కల్ట్ అనే అనాలి. అంత బాగా ఆమె పాత్ర అందరిలో నాటుకుపోయేలా నటించారు.. కాదు కే కాదు జీవించారు. తొలి సినిమాతోనే ఆమె చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. ఈ విషయంలో వైష్ణవి చైతన్య చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి.