కలలు అందరూ కంటారు ఆ కలలను కొందరే సాకారం చేసుకుంటారు. అటువంటి వారిలో ఒకరు గంగవ్వ. 60 ఏళ్ల వయసులో తానేమీ సాధించగలను అనుకునే వారందరికీ ఆమె ఓ రోల్ మోడల్. ఆమె జీవితమే ఓ పాఠం. ఇళ్లు కట్టుకోవాలన్న కలను నెరవేర్చుకున్న ఈ బామ్మ.. ఇప్పుడు మరో జర్నీ స్టార్ చేశారూ.
తెలుగు వాళ్లకు గంగవ్వ అంటే తెలియని వారూ ఉండరు. తెలంగాణలోని మారుమూల ప్రాంతంలో పుట్టి.. బీడీ కార్మికురాలి నుండి బిగ్ బాస్ షో వరకు ఆమె జర్నీ సాగింది. సాధారణ జీవితం నుండి సెలబ్రిటీ రేంజ్ కు ఎదిగింది. దీని కారణం మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానలే. ఈ ఛానల్ ద్వారా ఆమె పేరు కొందరికీ తెలిసింది. ఈ షోలో ఆమె తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు కానీ, ఆమె చేసే నటన భలే పన్నీగా ఉంటాయి. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో ఆమె రావడంతో తెలుగు వారందరికీ తెలిసిపోయింది. బిగ్ బాస్ నుండి అనారోగ్య కారణాలతో బయటకు వచ్చినప్పటికీ.. ఆమె ఆడిన తీరును అందరూ ప్రసంశించారు. బిగ్ బాస్ నుండి వెళ్లాక పలు సినిమాల్లో కూడా నటించింది. తన యూట్యూబ్ చానల్ ద్వారా ఆమె అలరిస్తూనే ఉంది.
విమానం ఎక్కాలని కోరిక ఎవ్వరికీ ఉండదు చెప్పండీ. ఆ కోరికను ఇప్పుడు మన గంగవ్వ తీర్చుకున్నారు. మొట్టమొదటిసారిగా విమానం ఎక్కింది. ఈ విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేసింది. ‘మేం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి’ అనే క్యాఫ్షన్తో విమానం ఎక్కబోయే ముందు ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. హింట్ అంటూ శివరాత్రి స్పెషల్ అని ఎక్కడి వెళుతున్నారో చెప్పకనే చెప్పేసింది. ‘శివరాత్రి సంబరాలకు ఈషా ఫౌండేషన్ సద్గురుగారి దగ్గరకు వెళ్తున్నారు కదా.. సేఫ్ జర్నీ.. హ్యాపీ జర్నీ..’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందరూ కలలు కంటారు.. అడ్డంకులను అధిగమిస్తూ ఆ కలలను కొందరే సాకారం చేసుకోగలరు. ఆమె జీవితమే అందుకు నిదర్శనం.
ఆమె తొలి సారిగా ఫ్లైట్ ఎక్కడంపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. ఆమె వెంట మరో యూట్యూబర్ అనిల్ జీలా కూడా ఉన్నారు. 60 ఏళ్ల వయసులో తామేమీ చేయలేమని భావించే వారికి గంగవ్వ ఓ ఆదర్శం. ఆమె ఓ రోల్ మోడల్. ఎక్కడో పల్లెటూళ్లో పుట్టిన తాను జీవితంలో ఇంత స్థాయికి ఎదుగుతానని కానీ, విమానం ఎక్కుతానని కానీ ఆమె ఊహించి ఉండదు. గంగవ్వ చేసే వీడియోలకు కేవలం గంటల వ్యవధిలోనే మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. దీంతో ఆమెకు బిగ్ బాస్ 4 లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షో తర్వాత ఆమెకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అభిమానులుగా మారిపోయారు. ఇక బిగ్బాస్ షో తర్వాత పాపులారిటీ సొంతం చేసుకున్న గంగవ్వకు ఆర్థికంగా బాగా స్థిరపడటమే కాకుండా తన సొంత ఇంటి కలను (రూ.7 లక్షలు) కూడా నెరవేర్చుకున్నారు. లవ్ స్టోరీ, రాజ రాజ చోర, గాఢ్ ఫాదర్, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, మల్లేశం వంటి తదుపరి సినిమాల్లో నటించి, మెప్పించింది.