డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్.. దిల్లీతో మ్యాచులో సూపర్ విక్టరీ నమోదు చేసింది. స్టార్ బ్యాటర్లు చేతులెత్తేయగా.. ఎవరికీ తెలియని ఓ కుర్ర ప్లేయర్ మాత్రం సింగిల్ హ్యాండ్ తో మ్యాచుని గెలిపించాడు. అతడి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
దిల్లీపై గుజరాత్ గెలిచింది. ఈ సీజన్ లో రెండో విజయం సాధించింది. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ గత మ్యాచులో ఆటగాళ్లందరూ కలిసికట్టుగా రాణించడం గెలవడానికి కారణమైంది. కానీ ఈ పోరులో అలా జరగలేదు. గుజరాత్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లు అద్భుతంగా కట్టడి చేశారు. కానీ చివర్లో అక్షర్ పటేల్ మెరుపుల వల్ల దిల్లీ క్యాపిటల్స్ 162 పరుగుల స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఒక్క సాయి సుదర్శన్ తప్ప. ఎందుకంటే టాపార్డర్ బ్యాటర్లు తక్కువ రన్స్ కొట్టి ఔటైన వేళ.. ఈ కుర్రాడు అద్భుతం చేశాడు. ఒంటిచేత్తో మ్యాచుని గెలిపించాడు. దీంతో అతడు ఎవరా అని క్రికెట్ ప్రేమికులు ఆరా తీస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ అనగానే అందరూ స్టార్ క్రికెటర్ల గేమ్ గురించి చూస్తారు. కానీ సాధారణ ఆటగాళ్లని స్టార్స్ ని చేసింది ఈ లీగ్ అని అస్సలు మర్చిపోకూడదు. హార్దిక్ పాండ్య, బుమ్రా లాంటి సాదాసీదా కుర్రాళ్లు స్టార్స్ అయింది ఈ టోర్నీవల్లే. ఇప్పుడు టీమిండియాలో వాళ్లు ఎంత కీలకంగా ఉన్నారో మీకు తెలిసిందే. అలా ఈ సీజన్ లో ఆడింది రెండు మ్యాచులే అయినా సాయి సుదర్శన్ అనే యంగ్ క్రికెటర్ తన మార్క్ చూపించాడు. చెన్నైతో తొలి మ్యాచులో 22 పరుగులు చేశాడు. ఇప్పుడు దిల్లీపై అయితే 62 పరుగులు చేసి విజయానికి కారణమయ్యాడు. చివర్లో మిల్లర్ ధనాధన్ బ్యాటింగ్ చేసినప్పటికీ సుదర్శన్ ఇన్నింగ్స్ లేకపోతే అది వేస్ట్ అయిపోయేది కదా!
తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల సాయిసుదర్శన్ ని గుజరాత్ టైటాన్స్.. వేలంలో కనీస ధర రూ.20 లక్షలకే సొంతం చేసుకుంది. దిల్లీతో ఆడిన ఇన్నింగ్స్ చూస్తే.. తనపై పెట్టుబడికి పూర్తి న్యాయం చేశాడనిపిస్తుంది. గత మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సుదర్శన్.. ఉన్నంతసేపు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. దీంతో దిల్లీతో మ్యాచులో తుదిజట్టులో స్థానం సంపాదించాడు. నోకియా, కుల్దీప్ లాంటి స్టార్స్ బౌలింగ్ లో సమర్థంగా ఎదుర్కొన్నాడు. తమిళనాడు తరఫున దేశవాళీల్లో అదరగొడుతున్న సుదర్శన్.. రంజీల్లో గతేడాది అడుగుపెట్టాడు. 7 మ్యాచుల్లో 572 పరుగులు చేసి శెభాష్ అనిపించాడు. దేశవాళీ వన్డే, టీ20 మ్యాచుల్లో సుదర్శన్ కు మంచి రికార్డే ఉండటం విశేషం. ఇలా రెండు మ్యాచులకే తన పేరు మార్మోగిపోయేలా చేసిన సాయి సుదర్శన్.. రాబోయే మ్యాచుల్లో ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడనేది చూడాలి? మరి గుజరాత్ ని సుదర్శన్ సింగిల్ హ్యాండ్ తో గెలిపించడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Sai Sudarshan – The Star of Gujarat Titans in today’s match 🔥⭐#DCvGT #GTvDC pic.twitter.com/Fs85PMctcL
— CricFit (@CricFit) April 4, 2023