బుల్లితెర డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ కార్యక్రమం ఇప్పుడు తెలుగులో, జెమినీ టీవీలో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. మిల్కీ బ్యూటీ రాక తో ఈ షో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిలిమ్ అకాడమీ ప్రాంగణంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మాస్టర్ చెఫ్‌లో అనేక వంటల పోటీలు నిర్వహించడంతో పాటు మాస్టర్‌చెఫ్ టైటిల్ గెలుచుకోవడానికి తీవ్రమైన పోటీ పడుతున్న పాకశాస్త్ర నిపుణులలో విజేతలకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు.
మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి ప్రముఖ చెఫ్‌లు చలపతిరావు, మహేష్ పడాల్, సంజయ్ తుమ్మ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక సోమవారం ప్రసారం అయిన మాస్టర్ చెఫ్ ఎపిసోడ్ లో జరిగిన ఓ ఎపిసోడ్ లో హోస్ట్ తమన్నా ప్రవర్తించిన తీరు అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా రాజేష్ అనే కంటెస్టెంట్ చేసిన వంటకం అందరికి నచ్చింది. తమన్నాతో సహా.
ఈ సందర్బంగా అంతకుముందు ఏంచేసేవాడివని రాజేశ్ ను అడిగారు జడ్జ్ లు. తాను మాస్టర్ చెఫ్ కు రాకముందు కంటెంట్ రైటర్ గా పనిచేసేవాడనని చెప్పాడు రాజేశ్. ఐతే వచ్చే జీతం సరిపోక చాలా ఇబ్బందులు పడేవాడినని, అందుకే తాను పనిచేసే యూట్యూబ్ చానల్ లో వంటల కార్యక్రమం ఉండటంతో తాను వంటలు చేస్తే కొంత జీతం ఎక్కువగా వస్తుందని భావించాడట. అదే విషయాన్ని ఛానల్ యాజమాన్యానికి చెబితే ముందు ఒప్పుకున్నారట.
కానీ ఒకటి రెండు ఎపిసోడ్స్ చేశాక, తన చేతులు నల్లగా ఉన్నాయని, ఆ చేతులతో వంటలు చేస్తే ఛానల్ లో చూసేవారికి నచ్చదని తనను వంటల కార్యక్రమం నుంచి తీసేశారని ఎంతో బాధతో చెప్పాడు రాజేశ్. దీంతో తమన్నా బాగా కదిలిపోయింది. వెంటనే రాజేశ్ దగ్గరకు వెళ్లి అతని చేయిను పట్టుకుని ఓదార్చింది. ఇప్పుడెలా ఉంది నీ చేయి అంటూ రాజేశ్ ను కాస్త కూల్ చేసే ప్రయత్నం చేసింది. మీరు నవ్వే వరకు నీ చేయిని వదలనని రాజేశ్ ను నవ్వించింది తమన్నా. మిల్కీ బ్యూటీ చేసిన పనికి ప్రేక్షకులు ఫితా అవుతున్నారు. మరి ఈ వీడియో మీరు చూసెయ్యండి.