ఆ తల్లి అందరిలానే తన కూతురికి ఉన్నంతలో గ్రాండ్ గా పెళ్లి చేయాలనుకుంది. ఓ మంచి పిల్లాడిని చూసింది. త్వరలో పెళ్లి కూడా చేయాలనుకుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఆమె ఒకటి తలిస్తే, విధి మరొకటి తలచింది. అకస్మాత్తుగా తల్లి మంచాన పడింది. ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూ బెడ్ పై రోజులు లెక్కపెట్టుకునే పరిస్థితి ఆమెది. ప్రాణం అయితే దక్కదని డాక్టర్స్ తేల్చేశారు. ఇలాంటి టైంలో ఆ తల్లి ఒకే ఒక్క కోరిక కోరింది. తనని నవమాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన తల్లి కోరిక నెరవేర్చడం తన బాధ్యత అని ఆ కూతురు సంకల్పించింది. ఆమె చివరి కోరికని తీర్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రేమించిన వారి కోసం తల్లిదండ్రుల్ని వదిలేస్తున్న రోజులివి. పెద్దలు అడ్డుచెబుతారని భయంతో లేచిపోతున్న రోజులివి. ఇలాంటి టైంలో తల్లి కోసం ఓ కూతురు ఐసీయూలో పెళ్లి చేసుకుంది. బిహార్ గయా జిల్లాలోని ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. మంగళ వాయిద్యాలు లేవు, కెమెరా హడావుడి అసలే లేదు. బంధు మిత్రుల చదివింపులు, ఆశీర్వాదాలు కూడా లేవు. కేవలం తల్లి ఆశీర్వాదం మాత్రం ఆ కూతురు తీసుకుంది. ఆ అమ్మాయితో పాటు ఆమె మనసుని అర్థం చేసుకున్న భర్తని కూడా అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గయా జిల్లాలో బాలి గ్రామానికి చెందిన లలన్ కుమార్ భార్య పూనమ్ వర్మ, గత కొన్నాళ్ల నుంచి గుండె జబ్బుతో బాధపడుతోంది. ఈ మధ్య కూతురికి సంబంధం ఖాయం చేశారు. నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇలాంటి టైంలో పూనమ్ ఆరోగ్యం పాడైంది. ఆస్పత్రిలో చేర్చితే, డాక్టర్స్ ఆమె ఇక బతకదని చెప్పేశారు. స్పృహలోనే ఉన్న పూనమ్.. కూతురి పెళ్లి చూడాలని ఉందంటూ భర్తని ప్రాధేయపడింది. అమ్మ చనిపోతుంది, ఇక తనతో ఉండదు అనే బాధలో దుఖాన్ని దిగమింగుతూనే కూతురు పెళ్లికి రెడీ అయింది. కాబోయే అల్లుడు కూడా ఒప్పుకోవడంతో ఐసీయూనే పెళ్లికి వేదికగా మారింది. వేద మంత్రాల నడుమ పూనమ్ కూతురు చాందిని, సుమిత్ గౌర్.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి బట్టల్లో ఉన్న కూతురు-అల్లుడిని చూసి పూనమ్ ఎమోషనల్ అయింది. కూతురి పెళ్లి చూసిన ఆనందంతో, తర్వాత రెండు గంటల్లోనే కన్నుమూసింది. ప్రస్తుతం ఈ విషయం నెటిజన్లని కంటతడి పెట్టిస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
मरती मां की ख्वाहिश देख ICU में हुई बेटी की शादी #Bihar #ICU pic.twitter.com/vpxDbcJbnr
— Aman Kumar Dube (@Aman_Journo) December 26, 2022