కమెడియన్ యాదమ్మ రాజు హాస్పిటల్ పాలైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరొక సీరియల్ నటుడు ఐసీయూలో చేరాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
కమెడియన్ యాదమ్మ రాజు కాలికి గాయమైన షార్ట్ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాలికి కట్టు కట్టుకుని హాస్పిటల్ బెడ్ పై యాదమ్మ రాజు ఉండగా.. ఆయనతో పాటు భార్య స్టెల్లా అక్కడే ఉన్నారు. దీంతో యాదమ్మ రాజుకి ఏమైందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందా? లేక జారిపడ్డారా? అనేది ఇంకా తెలియదు. తాజాగా మరొక నటుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. సోదరులిద్దరూ నటులే. ఒకరు సీరియల్ హీరో కాగా మరొకరు సీరియల్ మరియు సినీ నటుడు.
‘అలీ బాబా’ టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ నిగమ్ ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు సిద్దార్థ్ నిగమ్ వెల్లడించాడు. ఐసీయూలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. నా సోదరుడి ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేయండి అంటూ అభిమానులను కోరాడు. దీంతో అభిషేక్ ఫ్యాన్స్.. త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. చిన్న వైరల్ ఫీవర్ మాత్రమే వచ్చిందని సిద్దార్థ్ నిగమ్ వెల్లడించాడు.
మలేరియానో, డెంగ్యూనో కాదని, అభిమానులు కంగారు పడవద్దని అన్నాడు. వైరల్ ఇన్ఫెక్షన్ ప్రతి చోటా ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, తన సోదరుడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సిద్దార్థ్ నిగమ్.. టీవీ షోస్ తో పాటు మున్నా, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, ధూమ్ 3 వంటి చిత్రాల్లో నటించాడు. ధూమ్-3కి గాను ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును గెలుచుకున్నాడు. త్వరగా కోలుకొవాలని అభిమానులు కోరుకుంటున్నారు.