సమాజంలో రెగ్యులర్ గా జరుగుతున్న దారుణాలతో పాటు అసలు ఊహించలేని సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఘటనలపై ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు చర్యలు తీసుకుంటూ.. దారుణాలను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇంకా రోజురోజుకూ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నటి ప్రియమణి.. బీహార్ లో జరిగిన అత్యంత షాకింగ్ ఇన్సిడెంట్ పై స్పందించింది. ఆ ఘటనపై, సమాజం తీరుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. తన అసహనాన్ని బయటపెట్టింది.
సమాజంలో రెగ్యులర్ గా జరుగుతున్న దారుణాలతో పాటు అసలు ఊహించలేని సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఘటనలపై ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు చర్యలు తీసుకుంటూ.. దారుణాలను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇంకా రోజురోజుకూ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిపై పోలీసులు, ప్రభుత్వాలే కాకుండా కామన్ పీపుల్ కూడా రియాక్ట్ అవుతున్నారు. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా సమాజంలో జరిగే దారుణాలపై స్పందిస్తుంటారు. తాజాగా నటి ప్రియమణి.. బీహార్ లో జరిగిన అత్యంత షాకింగ్ ఇన్సిడెంట్ పై స్పందించింది. ఆ ఘటనపై, సమాజం తీరుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. తన అసహనాన్ని బయటపెట్టింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల బీహార్ రాజధాని పాట్నాలో ఓ వ్యక్తి కుక్కను రేప్ చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దారుణానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ కాస్త ప్రియమణి చెవిలో పడేసరికి.. సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి ఫోటో షేర్ చేస్తూ.. కుక్కల్ని కూడా వదలట్లేదా? అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. దీంతో ప్రియమణి పోస్ట్ పై చాలామంది రియాక్ట్ అవుతూ.. దేశంలో ఆడపిల్లల దగ్గరనుండి వృద్ధ మహిళల వరకు రక్షణ లేదనుకుంటే.. ఇప్పుడు జంతువులకు కూడా రక్షణ లేకుండా పోతోందంటూ తన ఉద్దేశాన్ని పోస్ట్ ద్వారా తెలియజేసింది.
ప్రస్తుతం ప్రియమణి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి.. స్టార్డమ్ సొంతం చేసుకున్న ప్రియమణి.. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుండి హీరోయిన్ గా కాకుండా సినిమాలలో కీలక పాత్రలు చేస్తూ బిజీగా మారింది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఓటిటి వెబ్ సిరీస్ లు, బుల్లితెర ప్రోగ్రామ్స్ చేస్తూ అలరిస్తోంది. అంతేగాక.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ.. ఫ్యాన్స్, ఫాలోయర్స్ కి టచ్ లో ఉంటోంది. ప్రెజెంట్ ప్రియమణి భాషాబేధం లేకుండా సినిమాలు చేస్తోంది. ఇంతలోనే ఇలా షాకింగ్ సంఘటన గురించి తెలిసి రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయింది. మరి బీహార్ సంఘటనపై, ప్రియమణి రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
— Hardin (@hardintessa143) March 20, 2023