ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన పాప్ సింగర్స్ లో ఒకరు మడోన్నా. ఆమె స్టేజ్ పై పర్ఫామెన్స్ ఇస్తుంటూ ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు. గత నలభై ఏళ్లుగా సంగీత ప్రపంచాన్ని ఊర్రూతలూగిస్తూ వస్తుంది మడోన్నా.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పాప్ సింగర్స్ ఉన్నా.. అతి కొద్దిమంది మాత్రమే బాగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో అమెరికన్ పాప్ సింగర్ మడోన్నా ఒకరు. ప్రపంచంలో సంగీత అభిమానులకు మడోన్నా పేరు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తన గాత్రంతో కుర్రాళ్లను ఉర్రూతలూగించి కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె స్టేజ్ షో ఉందంటే చాటు వేలాది అభిమానులు అక్కడ వాలిపోతుంటారు. అంతగా అభిమానులను తన గానంతో అలరించిన మడోన్నా ప్రస్తుతం తీవ్రమై ఇన్ ఫెక్షన్ వల్ల ఆస్పత్రిలో చేరింది చికిత్స పొందుతుంది. ఈ విషయం ఆమె మేనేజర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ మడోన్నా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైంది. ఇన్ ఫెక్షన్ కారణంగా ఆమెను న్యూయార్క్ లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ఆమె మేనేజర్ తెలిపారు. ఈ నెల 24 న మడోన్నాకు సీరియస్ బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ సోకడంతో ఆమె తీవ్ర అనారోగ్యాన్ని గురయ్యారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లి కొన్నిరోజుల పాటు ఐసీయూ లో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఆమె పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంటుందని ఆమె మేనేజర్ వెల్లడించారు. మడోన్నా పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆమె ప్రకటించిన వరల్డ్ టూర్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు.
మడోన్నా వయసు 65 ఏళ్లు.. ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టి దాదాపు నలభై ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా మడోన్నా 40వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరం ప్రారంభంలో సెలబ్రేషన్స్ టూర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా ఆమె ప్రపంచ వ్యాప్తంగా తిరిగి తన గానంతో అభిమానులను మరోసారి ఉర్రూతలూగించేందుకు సిద్దం అయ్యింది. జూలై 15న కెనడాలోని వాంకోవర్ లో తన సెలబ్రెషన్ టూర్ ప్రారంభించాలని భావించింది. ఇక మడోన్నా పర్యటన కోసం ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా టికెట్లు అమ్ముడు కూడా అయ్యాయి. ఇంతలోనే ఆమె ఇన్ ఫెక్షన్ తో తీవ్ర అస్వస్థతకు గురికావడం.. ఆస్పత్రిలో చేరడం తో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.