జబర్దస్త్ షో ద్వారా మనందరినీ నవ్వించిన చలాకీ చంటికి ఏమైంది? ఐసీయూలో చికిత్స చేయించుకోవాల్సినంత సీరియస్ అయ్యిందా?
తనదైన చలాకీతనంతో, కామెడీ టైమింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్న చలాకీ చంటి గత కొన్ని రోజులుగా ఎలాంటి టీవీ షోస్ లో గానీ, సినిమాల్లో గానీ కనబడలేదు. పలు సినిమాల్లో నటించిన చలాకీ చంటి టీవీ షోస్ లో హోస్ట్ గా కూడా చేశారు. కమెడియన్ గానే కాకుండా హోస్ట్ గా కూడా అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన ఏ సినిమాలోనూ కనబడలేదు. ఒకటి, రెండు షోస్ లో కనబడి ఆ తర్వాత షోస్ కి, సినిమాలకు దూరమాయ్యారు. అవకాశాలు రాక దూరమయ్యారని అనుకున్నారు. కానీ అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులూ దూరమయ్యారని అర్థమవుతుంది.
అసలు చలాకీ చంటికి ఏమైంది? ఐసీయూలో చికిత్స చేయించుకునేంత సీరియస్ అయ్యిందా? అంటే మీడియా వర్గాలు అవుననే అంటున్నాయి. చలాకీ చంటి ఆరోగ్యం బాలేదని వచ్చిన వార్తలను మొదట్లో ఎవరూ నమ్మలేదు. అయితే మీడియా వర్గాలు చెబుతున్న దాని ప్రకారం చలాకీ చంటి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీరియస్ హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో చేరినట్లు మీడియా వర్గాల సమాచారం. ఆయన కండిషన్ ప్రస్తుతం సీరియస్ గానే ఉందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్న వయసులో ఇలా ఆసుపత్రిలో చేరడం ఫ్యాన్స్ కి, కుటుంబ సభ్యులకు బాధ కలిగించే విషయం ఇది. ఆయన త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధిద్దాం.