ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ప్రముఖ సింగర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ విమర్శలకు తన లేటెస్ట్ పిక్ ద్వారా సమాధానం ఇచ్చింది ఆ స్టార్ సింగర్.
సాధారణంగా హీరోయిన్ తమ అందం పెరగడానికి, అందవిహీనంగా ఉన్న శరీర భాగాలను ఫర్ ఫెక్ట్ లుక్ లోకి మార్చుకోవడాని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం సహజమే. అయితే కొన్ని సార్లు ఆ సర్జరీలు విఫలం అయ్యి సదరు నటీమణులు అందవిహీనంగా మరుతుంటారు. ఇక తాజాగా తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ప్రముఖ సింగర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విమర్శలన్నింటికి తన లేటెస్ట్ ఫోటోతో సమాధానం చెప్పింది ఈ స్టార్ సింగర్.
వరల్డ్ పాప్ ఐకాన్ మడోన్నా.. గత కొన్ని రోజులుగా తన రూపంపై ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం గ్రామీ విజేత ప్రదర్శన కార్యక్రమంలో కనిపించిన మడోన్నా.. అందవికారంగా తయారు అయ్యిందని నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే మడోన్నా తన ముఖానికి సర్జరీ చేయించుకున్నాకే ఈ విమర్శలు ఎదుర్కొంది. ఈ విమర్శలపై తాజాగా దీటైన కౌంటర్ ఇచ్చింది. తన లేటెస్ట్ ఫోటోను షేర్ చేస్తూ..” చాలా మంది నా క్లోజ్-అప్ పిక్స్ ను టార్గెట్ చేశారు. స్త్రీద్వేషంలో వారు చిక్కుకున్నారు, వయోభారం వారు చూడరు. 45 ఏళ్లు దాటిన స్త్రీ అందంగా కనిపిస్తే.. నిరాకరించే ప్రపంచ ఇది” అని కాస్తా ఘాటుగానే స్పందించింది ఈ స్టార్ సింగర్.
ఇక నా కెరీర్ ప్రారంభం నుంచి నేను కేవలం మీడియా వల్లనే కిందికి దిగజారిపోయాను అని మడోన్నా అన్నారు. అయితే నేను ఇవన్నీ ఒక పరీక్షగా అనుకుంటూ ముందుకు సాగుతున్నాను. అయితే విమర్శలు గుప్పించే వారిపై ఎదురుదాడికి దిగితే ఎంతో ఆనందంగా ఉంటుందని ఆమె పేర్కొంది. మరి తన అందంపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మడోన్నాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.