సీనియర్ హీరో విజయ్ కాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకి సైతం పరిచయం అవసరం లేదు. రజనీకాంత్ తరువాత తెలుగునాట మార్కెట్ సంపాదించుకున్న హీరో విజయ్ కాంతే. ఇక అప్పట్లో విజయ్ కాంత్ డబ్బింగ్ మూవీస్ కి టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కొన్ని దశాబ్దాల పాటు.., తమిళనాట అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగిన విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమించింది.
నిజానికి విజయకాంత్ గత కొన్ని ఏళ్లుగా చాలా ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతోన్నారు. ఇక పోయిన ఏడాది.. ఆయన కరోనా బారిన పడ్డారు. తరువాత కాలంలో ఆ మహమ్మారి నుండి కోలుకున్నా.. ఫిజికల్ గా బాగా డల్ అయ్యారు. అప్పటి నుండి విజయ్ కాంత్ అన్నీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ.., తాజాగా ఇప్పుడు మరోసారి విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణించింది.
ముందుగా విజయ్ కాంత్ కి చెన్నైలోనే చికిత్స అందించారు. కానీ.., పరిస్థితి కాస్త సీరియస్ గా ఉండడంతో.. మరిన్ని వైద్య సదుపాయాల కోసం ఆయన్ని దుబాయ్ కి తరలించారు. అయితే.., ఇప్పుడు అక్కడ కూడా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో.., విజయ్ కాంత్ ని అమెరికాలోని ఓ పెద్ద హాస్పిటల్ కి తరలించినట్టు తెలుస్తోంది.తమిళనాట కేవలం హీరోగా మాత్రమే కాకుండా.., పొలిటీషియన్ గా కూడా విజయ్ కాంత్ తన మార్క్ చూపించారు. ఇలాంటి స్టార్ హీరో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ షాక్ లో ఉండిపోయారు. విజయ్ కాంత్ ఈ అనారోగ్య సమస్య నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.