ఫిల్మ్ డెస్క్- ఒకప్పుడు సినిమా విడుదలయ్యాక ధియేటర్స్ లో ఎన్ని రోజులు ఆడిందన్నది ప్రగణలోకి తీసుకుని ఆ సినిమా హిట్టా.. ఫట్టా అని తేల్చేవారు. అలా ఓ సినిమా రికార్డులను మరో సినిమా బద్దలు కొట్టేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా కాదు, ట్రైలర్, గ్లింప్, సాంగ్స్ ఇలా ఏదైనా యూట్యూబ్ రికార్డులను చూస్తున్నారు.
ముఖ్యంగా యూట్యూబ్ లో వీవ్స్ మరియు లైక్స్ ఎన్ని వచ్చాయన్నదాన్ని బట్టి రికార్డులను లెక్కేస్తున్నారు. టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు అన్ని భాషల్లోని ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. దీంతో డిజిటల్ రికార్డ్స్ పరంగా తెలుగు హీరోలు దూసుకుపోతున్నారు. ఒక హీరో రికార్డులను మరో హీరో బద్దలు కొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్ సృష్టించారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్నారు. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిగో ఇప్పుడు లైగర్ మూవీ గ్రింప్ తో విజయ్.. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పేరిట ఉన్న రికార్డు బద్దలుకొట్టారు. మొన్న లైగర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదలవ్వగా అందరికి బాగా నచ్చేసింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ లైగర్ సినిమాకు.. సాలా క్రాస్ బ్రీడ్.. అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ పెట్టారు. బాక్సింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను లైగర్ లో కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. సీనియర్ నటి రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
ఈ క్రమంలో పూరి జగన్నాధ్ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన లైగర్ గ్లింప్ వీడియోలో రిలీజ్ అయిన వెంటనే వీవ్స్ పరంగా దూసుకుపోతోంది. ఈ వీడియోకు విడుదలైన 24 గంటల్లోనే 15.92 మిలియన్ వ్యూస్, 3.99 లక్షల లైక్స్ వచ్చాయి. అప్పటి వరకు 8.49 మిలియన్ వ్యూస్ తో మొదటి స్థానంలో ఉన్న భీమ్లా నాయక్ రికార్డును విజయ్ దేవరకొండ తిరగరాశారు. దీంతో విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.