Video Call Trap : మొబైల్ ఫోన్ యూజర్లపై సైబర్ నేరగాళ్లు అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు. మోసం చేయటానికి ఏ చిన్న అవకాశం ఉన్నా వదిలిపెట్టడం లేదు. మొన్నటి వరకు అమ్మాయిల పేరుతో హనీ ట్రాప్ వేసి డబ్బులు గుంజేవారు. ఇప్పుడు వీడియో కాల్ చేసి డబ్బులు గుంజటం మొదలుపెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం నార్సింగికి చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్లో వీడియో కాల్ వచ్చింది. అతడు కాల్ లిఫ్ట్ చేశాడు. బ్లాక్ స్క్రీన్ తప్పితే ఏమీ కనిపించలేదు. కొద్ది సేపటి తర్వాత కాల్ కట్ చేశాడు. కాల్ కట్ అయిన కొన్ని నిమిషాలకు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి అతడు షాక్ అయ్యాడు.
మార్ఫింగ్ చేయబడ్డ అతడి న్యూడ్ ఫోటో తెరమీద ప్రత్యక్షమైంది. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫొటోలను అతడి కుటుంబసభ్యులకు మిత్రులకు పంపుతామని బెదిరించారు. దీంతో అతడు విడతల వారీగా రూ.5 వేలు, రూ.20 వేలు, రూ.30వేలు ఇచ్చుకుంటూ వచ్చాడు. వాళ్లు డబ్బు కోసం ఇబ్బంది పెడుతూ ఉండటంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రైలు పట్టాలపై బాలిక! ప్రాణాలకి తెగించి కాపాడిన యువకుడు!