ఫిల్మ్ డెస్క్- రోడ్డు ప్రమాదం తరువాత మోగా హీరో సాయి ధరమ్ తేజ్ బయట ఎక్కడా కనిపించడం లేదు. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాక ఇంటికే పరిమితం అయ్యారు. కేవలం కుటుంబ వేడుకల్లో మాత్రం పాల్గొంటున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పెండింగ్ సినిమాలకు సంబందించిన షూటింగ్స్ లో పాల్గొనేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.
ఇటువంటి సమయంలో సాయి ధరమ్ తేజ్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలవడం ఆసక్తికరంగా మారింది. నూతన సంవత్సరం సందర్భంగా స్వయంగా సాయి ధరమ్ తేజ్ ఇంటికి వెళ్లిన మంత్రి కిషన్ రెడ్డి.. ఆయన యోగ క్షేమాలు, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సాయి ధరమ్ తేజ్, కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ట్విట్టర్ పోట్స్ లో సాయి ధరమ్ తేజ్ ఏమన్నారంటే.. మీరు మీ బిజీ షెడ్యూల్ లో కూడా నన్ను కలిసేందుకు స్వయంగా మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది.. ఈ కొత్త సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా.. అని అన్నారు. కిషన్ రెడ్డితో కలిసి దిగిన ఓ ఫొటోను సైతం షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అభిమానులు సైతం తేజ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, ఈ యేడాది ఆయన మరిన్ని సూపర్ హిట్ సినిమాలతో సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నందితో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ఉండబోతోందని, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.
Thank you @Kishanreddybjp Garu for making time to affectionately visit me at home despite your busy schedule and for your warm and kind words.
Wishing you a great year ahead. pic.twitter.com/Lne2XNv4uJ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 1, 2022