తిరుమలకు వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి బోర్టు శుక్రవారం కీలక ప్రకట చేసింది. శ్రీవారిని భక్తులు నిత్యం వేల సంఖ్యలో దర్శించుకుంటారు. ఇక శని, ఆదివారల్లో అయితే ఈ సంఖ్య ఇంక పెరుగుతుంది. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకుని భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. దీంతో భక్తుల దర్శనంకి చాలా సమయం పడుతుంది. దీనికి తోడు ఈ వారాంతపు రోజుల్లో వీఐపీలు లేదా వారి సిఫార్సు దర్శనాలు ఉంటుంటాయి.
ఇవి సామాన్యా భక్తులను ఇంక అసౌర్యానికి గురిచేస్తాయి. వీఐపీ దర్శనానికి కేటాయించిన సమయాలంలో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండేవాళ్లు. ఈ క్రమంలో శుక్రవారం తితిదే ఈ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారాలలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది. VIPs కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో శుక్ర, శని, ఆదివారాల్లో అదనంగా సర్వదర్శన టోకన్లు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది. మరి.. TTD తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.