TSRTC ఎండీ సజ్జనార్ యువతకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ లో స్పందించిన ఆయన.. ఇలాంటి పిచ్చి వేశాలు వేయకండి అంటూ ఫైర్ అయ్యారు.
TSRTC ఎండీ సజ్జనార్ యువతకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ట్విట్టర్ లో స్పందించిన ఆయన.. ఓ వీడియోను కూడా జత చేస్తూ ఇలాంటి పిచ్చి వేశాలు వేయోద్దు అంటూ రాసుకొచ్చారు. సజ్జనార్ చేసిన ఈ ట్విట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. విషయం ఏంటంటే? ప్రస్తుత యువత రోడ్లపై బాధ్యత లేకుండా వాహనాలు నడిపిస్తూ ఇతరుల ప్రాణాలకు కారణమవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా డ్రై చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వంటి పొరపాట్లు చేస్తూ ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇక ఇంతటితో సరిపెట్టకుండా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రీల్స్ చేస్తూ ఏకంగా నడి రోడ్డుపైనే బరితెగించి ప్రవర్తిస్తున్నారు.
అచ్చం ఇలాగే హద్దులు దాటి ప్రవర్తించిన ఓ యువకుడు.. బైక్ పై వెళ్తూ ఆర్టీసీ బస్సును వెనకాల నుంచి కాలుతో నెడుతున్నట్లుగా వీడియో తీసుకున్నాడు. ఇదే వీడియో కాస్త వైరల్ గా మారి చివరికి TSRTC ఎండీ సజ్జనార్ వరకు వెళ్లింది. ఈ వీడియోపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. వెర్రి వేయి విధాలు అంటే ఇదే. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి.. అంటూ రాసుకొచ్చారు. దీంతో పాటు ఆ యువకుడి వీడియో కూడా పోస్ట్ చేశాడు. అయితే ఆయన ట్విట్ పై ఒక్కోరు ఒకలా స్పందిస్తున్నారు. సజ్జనార్ తాజా ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
వెర్రి వేయి విధాలు అంటే ఇదే!
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి.#RoadSafety @MORTHIndia pic.twitter.com/24GFCp8vvX
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 2, 2023