బంగారం కొనాలని భావిస్తున్నారా.. అయితే ఇప్పుడే కొనడం బెటర్ అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మే నెల మొత్తంగా చూసుకుంటే బంగారం ధర దిగి వచ్చిందని.. అందుకే త్వరపడమని చెబుతున్నారు. మరి ఎంత దిగి వచ్చింది అంటే..
బంగారం కొనాలనుకునేవారికి భారీ శుభవార్త అనే చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు పెరుగుతూ వస్తోన్న ధరలకు కళ్లెం పడింది. నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. దేశీయంగా కూడా అదే పంథా కొనసాగింది. ఇక ఈ నెలలో బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ.. బంగారం ధర 1800 రూపాయల మేర తగ్గగా.. వెండి ధర.. ఏకంగా 6,700 రూపాయలు దిగి వచ్చింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే.. ఈ నెలలో బంగారం కొనడం మేలని అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. మరి నేడు హైదరాబాద్, ఢిల్లీలో బంగారం ధర ఎంత ఉంది.. అంటే..
ఈ నెలలో హైదరాబాద్‌లో కూడా బంగారం ధర దిగి వచ్చింది. గడిచిన 20 రోజుల్లోనే.. బంగారం ధర తులం మీద ఏకంగా రూ. 1800 మేర పతనమైంది. బంగారం కొనే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. ఈ నెల 5న హైదరాబాద్‌లో 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 62,400 వద్ద ఉండేది. ఇక నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 60,600 వద్ద ఉంది. అంటే ఈ 23 రోజుల్లో 24 క్యారెట్ బంగారం ధర 1800 రూపాయలు దిగి వచ్చింది. అలానే 22 క్యారెట్ బంగారం ధర కూడా తగ్గింది. ఈ 23 రోజుల్లో 1650 రూపాయలు తగ్గి.. నేడు 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 55,550 రూపాయలుగా ఉంది. అలానే దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర 55,700 రూపాయలు ఉండగా ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 60,750 రూపాయలుగా నమోదైంది.
ఇక బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా దిగి వచ్చింది. గడిచిన 23 రోజుల వ్యవధిలో వెండి ధర ఏకంగా రూ.వేలల్లో పతనమైంది. వెండి ధర మే 5న రూ. 83,700 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు ఈ వెండి దర రూ. 77 వేల వద్ద ఉంది. అంటే సిల్వర్ రేటు ఏకంగా రూ. 6,700 దిగి వచ్చింది. నేడు హైదరాబాద్‌లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి మీద రూ.100 పెరిగి.. 77 వేల రూపాయలుగా ఉండగా.. ఢిల్లీలో కిలో వెండి ధర 73 వేల రూపాయలుగా ఉంది.
ఇక నేడు అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే బంగారం ధరలు ఔన్స్‌కు 1962 డాలర్లకు దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నెల ప్రాంరభంలో గోల్డ్ రేటు 2 వేల డాలర్లకు పైనే ట్రేడ్ అయ్యింది. ప్రసుత్తం భారీగా దిగి వచ్చి.. 1963 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ పరిణామాలకు అనుకూలంగా దేశీ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతానికి బంగారం తగ్గినప్పటికి.. త్వరలోనే భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. వచ్చే ఏడాది నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 68 వేలకే చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక వెండి రేటు కేజీకి రూ. 90 వేలకు చేరొచ్చని అభిప్రాయపడుతున్నారు. అందుకే బంగారం కొనాలనుకునే వారు.. ఇప్పుడే తీసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు.