స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 100 రూపాయలు తగ్గింది
10గ్రా 24 క్యారెట్ ధరలో మార్పు లేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,650.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,820.
1కిలో వెండి 73,900
బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర లో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి 44 వేల 650 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 820 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 200 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 73 వేల 900 రూపాయలకు చేరింది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 350 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 490 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 060 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,160 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,710 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,710 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,800 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50, 850 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.