అమరావతి- మనం ఇప్పటి వరకు చాలా రకాల దొంగతనాలు చూశాం. కారు, బైక్, ఇంట్లో బంగారం, ఇతర వస్తువులు దంగతనానికి గురయ్యాయని పోలీసులకు పిర్యాదులు వస్తుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన దొంగతం జరిగింది. ఆవును అక్కడ ఏకంగా రోడ్డునే దొంగతనం చేశారు. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా.. ఐతే అసలు విషయం తెలుసుకొండి..
అమరావతిలో ప్రభుత్వం వేసిన రోడ్డును తవ్వేసి ఇసుక, మట్టి, కంకర దొంగిలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోదుగులింగాయపాలెం గ్రామానికి సమీపంలో సీడ్ యాక్సన్ పక్కన ఉన్న రోడ్డును గుర్తు తెలియని వ్యక్తులు తవ్వి కంకర ఎత్తుకెళ్లిపోయారు. మొన్న ఉద్దండరాయునిపాలెం దగ్గర రోడ్డును తవ్వేసిన రహదారికి దగ్గర్లోనే ఈ రోడ్డు ఉండటం గమనార్హం. ఆ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పది రోజుల క్రితమే మోదుగులింగాయపాలెం దగ్గర ఈ రోడ్డును తవ్వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ వరకు ఈ రోడ్డు వెళ్తుంది. ఈ రోడ్డును మొత్తం నాలుగు అడుగుల మేర తవ్వేసిన గుర్తు తెలియని దండగులు, 100 టిప్పర్ల కంకర దొంగిలించారని అంటున్నారు. రాత్రి సమయంలో కంకరను తరలించాలని భావిస్తున్న గ్రామస్తులు, టిప్పర్లు, జేసీబీలు తిరిగిన గుర్తులను గుర్తించారు.
అమరావతి దళిత జేఏసీ నాయకులు, వెలగపూడి రైతులు రోడ్డు తవ్వేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకే కొందరు కుట్రపూరితంగా రోడ్లను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ రోడ్డు దొంగతనం వ్యవహారాన్ని కోర్టులు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని వారు కోరారు. ఐతే ఈ రోడ్డు వ్యవహారంపై పోలీసులు ఇప్పటివరకు నోరుమెదపలేదు.
రాష్ట్రం లో దొంగలు పడి మొత్తం దొచేస్తున్నరు. చివరికి రాజధాని అమరావతి లో రోడ్లని దోచుకు పోతున్నారు ఇంకా ఇలానే ఊరుకుంటే నిన్ను, నీ ఇంట్లో వాళ్ళని అందరిని నడి రోడ్డు మీద నిలబెట్టి దొచుకుంటడు ఆలోచించు ఆంధ్రుడా మేలుకో నీ ఉనికిని కాపాడుకో……#SaveAndhraPradesh #SaveAmaravati pic.twitter.com/OmE40CnxN4
— Madhuri Royal B+ (@royal_madhuri) August 1, 2021