అన్నీ భాషల్లో ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ఇక అప్పట్లో ఇదే ట్రెండ్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ కొట్టింది ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కౌంట్ పెంచడంలో ఈ వెబ్ సిరీస్ దే మెయిన్ రోల్. ఇంత సక్సెస్ వస్తే.., మేకర్స్ ఊరుకుంటారా? కొన్నరెండు నెలల క్రితం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ని కూడా విడుదల చేశారు. ఈ సీరీస్ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ సమంత కీ-రోల్ ప్లే చేసింది.
నిజానికి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ విడుదలై రెండు నెలలు గడుస్తున్నా.., ఇప్పటి వరకు తెలుగు వెర్షన్ మాత్రం విడుదల కాలేదు. దీంతో.., ప్రేక్షకులు తెలుగు వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారందరి ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ అమెజాన్ ప్రైమ్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 తెలుగు వెర్షన్ విడుదల చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ని తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినా.., ఇంకా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి.., స్ట్రీమింగ్ డేట్ ని కూడా ఫైనల్ చేయనున్నారట. ఇక ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ లో మనోజ్ భాజ్‌పాయి లీడ్‌రోల్‌లో నటించగా.., ప్రియమణి, సమంతలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. మరి.., రెండు నెలలు ఆలస్యంగా స్ట్రీమింగ్ కాబోతున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తెలుగు వెర్షన్ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.