“డబ్బు సంపాదించడం పెద్ద కష్టం ఏమి కాదు. నేను తలుచుకుంటే 5 ఏళ్లలో 50 లక్షలు సంపాదిస్తాను”… ఛాలెంజ్ మూవీలో చిరంజీవి డైలాగ్ ఇది. ఇలాంటి మాటలు, శపధాలు సినిమాల్లో బాగానే ఉంటాయి. రియల్ లైఫ్ కష్టంఅంటారా? నిజమే.. డబ్బు సంపాదించడం అంత సులువు కాదు. కానీ.., కాస్త తెలివిగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే లక్షలు వచ్చి పడతాయి. షేర్ మార్కెట్ లో మెళుకువలు తెలిసిన వారికి ఇది డబ్బుతో పెట్టిన విద్య.
తాజాగా ఇలానే కొంత మంది కోటీశ్వరులు అయిపోయాయారు. 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి 15 లక్షలు వచ్చి పడ్డాయి. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా ఒకటిన్నర కోటి వచ్చి పడింది. ఇదంతా కేవలం 8 నెలల కాల వ్యవధిలో జరిగిపోయింది. మరి.. ఇంత అద్భుతం ఎలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర… స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీ. కానీ.., 2009 నుండి 2019 వరకు మొత్తం 49 క్వార్టర్లలో 47 సార్లు కంపెనీకి నష్టాలు తప్ప లాభాలు లేవు. దీంతో.., ఈ కంపెనీ షేర్ 2020 అక్టోబర్ 15 న రూ. 2.70 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. ఇలాంటి సమయంలో టాటా టెలీసర్వీసెస్ అవతారాన్ని మార్చాలని టాటా సన్స్ నిర్ణయించుకుంది.
టాటా సన్స్ లాంటి బలమైన ప్రమోటర్ ఉండటంతో టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర కంపెనీ త్వరగా లాభాల బాట పట్టింది. ఏకంగా టాటా సన్స్ ఈ కంపెనీ షేర్స్ పై ఇన్వెస్ట్మెంట్ చేసింది. దీంతో.., టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర కంపెనీ షేర్ వాల్యూ రూ. 2.70 వద్ద నుండి ఏకంగా రూ.44.60కి చేరుకుంది. అంటే రూపాయికి 45 రెట్లు లాభం అనమాట. ఈ మొత్తం పరిణామంతో.., టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర కంపెనీ షేర్స్ పై ఇన్వెస్ట్ చేసిన వారు నెలల సమయంలోనే కోటీశ్వరులు అయిపోయారు. ఇది లక్ అంటే.