ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల తప్పిదాలు, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణాలు అంటున్నారు అధికారులు.
దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది దుర్మరణం పాలవుతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగంగా వాహనాలు నడపడం ఒకటైతే.. కొన్నిసార్లు ప్రకృతి వైపరిత్యాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా రోడ్డు ప్రమాదాల్లో పెద్దదిక్కు కోల్పోయిన ఎంతో మంది కుటుంబాలు అనాథలుగా మిగులుతున్నారు. తాజాగా రాజస్థాన్.. అజ్మీర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ లోని జయపుర-అజ్మీర రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. రామ్ నగర్ ప్రాంతంలో ఓ భారీ ట్యాంకర్ తో కూడిన లారీ ప్రయాణిస్తుంది. గురువారం మధ్యాహ్నం సమయంలో లారీ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో లారీ నడుపుతున్న డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అతివేగంగా నడుపుతూ.. అటుగా వెళ్తున్న బైక్ ని ఢీ కొట్టాడు. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న కారుపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు, బైక్ పై ప్రయాణిస్తున్నవారు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా తీర్థయాత్ర నిమిత్తం ఫాగీ నుంచి అజ్మీర్ కి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో సంఘటనలో..
ఈరోజు మహారాష్ట్ర సంగ్లీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, బస్సు ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాద జరిగిన సమయంలో అదృష్టవాత్తు ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవడం వలన కారులోని ఐదో వ్యక్తికి ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తాజాగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.