ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. కానీ.., ఆ చావు ఎలా వచ్చింది అనేదే ముఖ్యం. కడుపున పుట్టిన బిడ్డలే తన పాలిట యమభటులైతే.., ఆ తల్లి ఎంత నరకం అనుభవించి చనిపోయి ఉంటుంది? తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి జిల్లాలో ఇప్పుడు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
తిరునెల్వేలి జిల్లా పాళయంకోటైకి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కోయిల్‌పిచ్చై, ఉషా దంపతులు స్పర్ధల కాలంగా విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు నీనా(21), రీనా(19). కోయిల్‌పిచ్చై ఒంటరిగా మున్నీర్‌పల్లంలో నివాసనమ్ ఉంటుండగా.., టీచర్ అయిన ఉషా..
తన ఇద్దరు కూతుర్లను ఇంజినీరింగ్ చదివించింది. కానీ.., ఇంట్లో పెద్ద దిక్కు లేకపోవడం, చుట్టూ ఆర్ధిక సమస్యలు కారణంగా కుమార్తెలు ఇరువురికి మతిస్థిమితం లేకుండా పోయింది. అయినా.., ఉషా మాత్రం తన కుమార్తెలను ఇంట్లోనే ఉంచుకుని వైద్యం అందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చింది.
అయితే.., గత కొని రోజులుగా తల్లి ఉషాతో కుమార్తెలు గొడవ పడుతూ వస్తున్నారు. ఆ ముందు రోజు కూడా ఇలానే గొడవపడ్డారు. అయితే.., అప్పటి నుండి ఉషా బయటకి రాలేదు. ఇలా ఒక రోజంతా గడిచిపోయింది. అయినా ఉషా బయటకి రాలేదు. దీంతో.., ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.., ఉషా రక్తపు మడుగులో నిర్జీవంగా పడిపోయి కనిపించింది. మతిస్థిమితం లేని ఆ పిల్లలు కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నారు.
తమ తల్లిని తామే చంపి.., వారు ఆ రక్తపు మడుగులోనే ఆడుకుంటూ కనిపించడంతో స్థానిక ప్రజలు బిత్తరపోయారు. వారు వెంటేనే పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి, ఆ ఇద్దరు కూతుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
ఒకరు కత్తితో, మరొకరు ఇనుపరాడ్‌తో తల్లిపై దారుణంగా దాడి చేయడం వల్లే ఆమె మృతి చెందినట్లు విచారణలో తేలింది. ఇక ఇద్దరు కుమార్తెలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి.. ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.