ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అటు ఓవర్సీస్లోనూ పుష్ప తన హవాను చూపిస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే వరకు పుష్ప జోరు ఇలానే ఉండనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
పుష్ప సినిమా కలెక్షన్లు కనీవినీ ఎరుగని రీతిలో వసూలు అవుతున్నాయి. గత వీకెండ్లో పుష్ప కలెక్షన్ల విషయంలో దుమ్ములేపేసింది. కేవలం 8 రోజుల్లోనే బుక్ మై షో యాప్‌లో దాదాపు 35 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయంటే పుష్ప ఏ రేంజ్ లో దూసుకెెళ్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సంవత్సరంలో పుష్ప సినిమా విషయంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు నమోదైంది.
పుష్ప సినిమా ఇప్పటికే రెండు వందల కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసేసిందని సమాచారం. అటు బాలీవుడ్ మార్కెట్ లోనూ అల్లు అర్జున్ తన స్టామినాను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో హిందీ లో లైఫ్ టైం కలెక్ట్స్ 50 కోట్ల వరకు వెళ్లేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 30 కోట్ల రాబట్టినట్టు లెక్కలు చెబుతున్నాయి.
ఇదిగో ఈ నేపధ్యంలో పుష్ప భారీ సక్సెస్ అయిన సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ తన తోటి దర్శకులకు స్పెషల్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, శివ నిర్వాణ, సందీప్ రెడ్డి వంగా, రాహుల్ సంకృత్యాన్, మున్నా, కొరటాల శివ, సంపత్ నంది, ఇంద్రగంటి మోహనకృష్ణ ఇలా దర్శకులంతా పాల్గొన్నారు. అందరు డైరెక్టర్లు కలిసి పుష్ప సక్సెస్‌ను ఎంజాయ్ చేశారని తెలుస్తోంది.