స్పెషల్ డెస్క్- సౌందర్య.. ఈ పేరును తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది సిని పరిశ్రమలో సౌందర్య నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. చిన్న వయస్సులోనే సుమారు 100 సినిమాల్లో నటింటి రికార్డు సృష్టించింది సౌందర్య. మహానటి సావిత్ర తరువాత నటనలో సౌందర్య అంతటి పేరు తెచ్చుకుంది. మహిళా అభిమానులతో పాటు సౌందర్యకు అన్ని వయసుల వారు ఫ్యాన్స్ అయ్యారంటే ఆమె నటన ఏంత గొప్పగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.
సౌందర్య కర్ణాటకలో పుట్టినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఒకప్పటి టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అగ్ర హీరొలందరి సరసన సౌందర్య నటించింది. హీరో వెంకటేశ్, సౌందర్య కాంబినేషన్ బాగా హిట్ అయ్యింది. సౌందర్య దక్షిణాదిలో మంచి ఫాంలో ఉండి, నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే చనిపోయింది. 2004లో ఓ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ లో వెళ్తూ ప్రమాదంలో మరణించింది.
సౌందర్య చనిపోయి 17 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆమె ప్రేక్షకుల మదిలో అలాగే ఉండిపోయింది. ఇదిగో మళ్లీ ఇన్నాళ్లుకు సౌందర్యను పోలిన ఓ అమ్మాయి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అచ్చు సౌందర్య లాగే కనిపిస్తున్న ఈ యువతి పేరు చిత్ర. ఉంటున్నది మలేషియాలో. సౌందర్య లాగే మాట్లాడుతూ చేసిన వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చిత్రను చూసిన వాళ్లంతా జూనియర్ సౌందర్య అని అంటున్నారు. సౌందర్య మళ్లీ పుట్టిందా అని కామెంట్ చేస్తున్నారు. చిత్ర అచ్చు సౌందర్య లాగే ఉందని, సినిమాల్లో నటిస్తే బావుంటుందని నెటిజెన్స్ అంటున్నారు. ఐతే చిత్ర మాత్రం సినిమాల్లో నటించడంపై స్పందించలేదు. chitra_Jii02 పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో చిత్ర వీడియోను మీరు చూడవచ్చు. ఖచ్చితంగా మీకు సౌందర్యను చూసిన అనుభూతి కలుగుతుంది.