ప్రముఖ యంగ్ సింగర్ యశస్వి కొండెపూడి తనది కాని స్వచ్ఛంద సంస్థను తనదిగా చెప్పుకుని తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాడంటూ ‘నవసేవ ఫౌండేషన్’ నిర్వహకురాలు ఫరా కౌసర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. నవసేవ అనే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నానని, ఆ ఎన్జీవో ద్వారా సుమారు 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటున్నాడని ఆమె తెలిపారు. ఆ సంస్థను తానే నడుపుతున్నానని, 58 మంది అనాథ పిల్లలను చదివిస్తున్నానని ఆమె వెల్లడించారు. యశస్విపై చర్యలు తీసుకుంటానని కూడా ఆమె హెచ్చరించారు.
ఫరా కౌసర్ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే యశస్వి.. ఫరా కౌసర్ ఆరోపణలపై స్పందించారు. ప్రముఖ డిజిటల్ టీవీ సుమన్ టీవీకి వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ సరిగమప ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీరు చేసిన సహాయాలకు సంబంధించిన వీడియో బైట్స్ ఏవైనా ఉంటే ఇవ్వండి అన్నారు. నేను కొన్ని ట్రస్టులకు సహాయం చేశాను. యాక్సిడెంట్ అయిన వాళ్లకు కూడా సహాయం చేశాను. నా ఫ్యాన్ పేజ్ అబ్బాయికి ఏవైనా వీడియో బైట్స్ ఉంటే తీసుకో అని చెప్పాను.
సాధ్య ఫౌండేషన్‌కు నేను చాలా సార్లు సహాయం చేశాను. ఈ సాధ్య ఫౌండేషన్ వాళ్లు నవసేవ లాంటి చాలా అనాథ ఆశ్రమాలకు స్నాక్స్, ఫుడ్ పంచి పెడుతూ ఉంటారు. నేను సాధ్య ఫౌండేషన్ ద్వారా ఇన్‌డైరెక్ట్ వాళ్లకు సహాయం చేశాను. డైరెక్ట్‌గా చేయలేదు. నాకు నవసేవ తెలీదు. నేను ఎప్పుడూ వెళ్లలేదు కూడా. సాధ్య ఫౌండేషన్ మాలాంటి వాళ్ల ద్వారా అనాథ ఆశ్రమాలకు సహాయం చేస్తుంది. మా వాళ్లు ‘ ప్రోమోలో వీడియో బైట్ కావాలండి. యశస్వి అన్నయ్యకు ఆల్ ది బెస్ట్ చెబుదాం. నవసేవకు వెళ్లి వీడియో బైట్ తీసుకోవచ్చా’ అని కౌసర్‌ను అడిగారంట. ఆమె ఓకే అన్నదంట. వీడియో కోసం వెళితే.. ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పింది. తర్వాత కెమెరా మ్యాన్ ఏం చేశాడంటే.. బయటకు వచ్చి ఆ బోర్డు వీడియో కూడా తీశాడు. వీటన్నింటిని టీవీ వాళ్లకు పంపారు.
ప్రోమోలో నేమ్ బోర్డు ఉన్న వీడియో కలిపి చేశారు. నేను చేసిన సేవా కార్యక్రమాలతో పాటు.. నవసేవ బోర్డు వీడియో కూడా పెట్టారు. ఆ విషయం నాకు కూడా తెలీదు. తర్వాత కొంత మంది నాకు ఈ విషయం చెప్పారు. నేను కౌసర్ గారికి చాలా సార్లు ఫోన్ చేశాను. ఆమె పట్టించుకోలేదు. మేము ప్రోమో వీడియోను డిలీట్ చేయించాము. టెలికాస్ట్‌లో కూడా మేము ఆమె నవసేవ వీడియో బైట్‌ను వాడలేదు. తర్వాత దేంట్లోనూ వాడలేదు. నా బర్త్‌డేను ఫ్యాన్స్ నవసేవలో జరిపారు. అక్కడి వాళ్లకు స్నాక్స్ కూడా పంచి పెట్టారు. నవసేవకు నేను ఇన్‌డైరెక్ట్‌గా సహాయం చేస్తూ వస్తున్నాను’’అని అన్నారు. మరి, ఈ వివాదంపై ప్రముఖ యంగ్ సింగర్ యశస్వి కొండెపూడి ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.