‘గాలి వాటం లాగా సాగే అలవాటే లేక’అంటూ ఒక్క పాటతోనే అందరినీ మెస్మరైజ్ చేసిన యంగ్ టాలెండెట్ సింగర్ కొండేపూడి యశస్వి. ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఫేమ్ కోసం ఓ ఎన్జీవోకి సాయం చేసినట్లు చెప్పుకుని మోసం చేశాడని ఆరోపణలు రాగా, వివరణనిచ్చారు. కాగా, ఆయనకు తోటి సింగర్లు మద్దతుగా నిలుస్తున్నారు.
ప్రముఖ యంగ్ సింగర్ యశస్వి కొండెపూడి తనది కాని స్వచ్ఛంద సంస్థను తనదిగా చెప్పుకుని తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాడంటూ ‘నవసేవ ఫౌండేషన్’ నిర్వహకురాలు ఫరా కౌసర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. నవసేవ అనే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నానని, ఆ ఎన్జీవో ద్వారా సుమారు 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటున్నాడని ఆమె తెలిపారు. ఆ సంస్థను తానే నడుపుతున్నానని, 58 మంది అనాథ పిల్లలను చదివిస్తున్నానని ఆమె వెల్లడించారు. యశస్విపై […]
యశస్వి కొండెపుడి.. తెలుగు సంగీత ప్రపంచ ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సరిగమప సింగింగ్ షోలో శర్వానంద్ నటించిన జాను మూవీలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడాడు యశస్వి. ఈ పాటతో ఒక్క రాత్రిలోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యశస్వి. అదీకాక తన గాత్రంతో సరిగమప సింగింగ్ ఐకాన్ టైటిల్ కూడా గెలిచాడు. దాంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు యశస్వి. అయితే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు యశస్వి. […]